హైదరాబాద్ (Hyderabad) హైటెక్స్ లో నిర్వహించిన బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో తెలంగాణ (Telangana) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధునాతన పద్దతులను అనుసరించి ప్రపంచంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చినట్లు పేర్కొన్నారు.
నిర్మాణ రంగంలో వచ్చిన రెవెల్యూయేషన్ కి సంబంధించిన పుస్తకం విడుదలైనప్పుడు తాను ఆ పుస్తకాన్ని పరిశీలించినట్లు వెల్లడించారు. ఆ పుస్తకంలో ప్రస్తుతం నిర్మాణ రంగంలో చోటు చేసుకొన్న అనేక మార్పుల గురించి ఉండడం గమనించినట్లు తెలిపారు. శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు సులువైన అధునాతన పద్దతులను అనుసరించడం ద్వారా నిర్మాణ రంగం చాల త్వరగా ముందుకు పోతోందని భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు.
అయితే ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.. అధునాతన పద్దతులను అనుసరించే క్రమంలో వాటిని కొనడానికి, అలానే పనులు జరిపించుకోవడానికి.. వర్క్ శాంక్షన్ అయ్యిందని బ్యాంకుల నుంచి తీసుకొన్న నగదును ఉపయోగిస్తారు.. చివరికి బిల్లులు శాంక్షన్ కాకపోవడం వల్ల పెద్దపెద్ద కంపెనీలు సైతం దివాళా తీశాయని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం ఆర్థికపరమైన సమస్యలని తెలిపారు.
ఈ సమస్యలను అధిగమిస్తే తప్ప పని చేయలేమని నిర్మాణ రంగ సంస్థలు వెల్లడిస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు 60, 70 లలో నిర్మాణ రంగంలో రెపరెపలాడిన కంపెనీలు నేడు కనుమరుగవుతున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు.. అయితే ఇలాంటి నవ నిర్మాణాలను నిర్మిస్తున్న మిమల్ని కాంట్రాక్టర్స్ గా చూడం లేదని వెల్త్ క్రియేటర్స్ గా చూస్తున్నామని భట్టి తెలిపారు.
ప్రభుత్వ పరంగా జీతాలు, ఫెసిలిటీస్ లేనప్పటికీ మీకు మీరుగా కొన్ని వ్యవస్థలను సృష్టించుకొని.. దాని ద్వారా ఈ నిర్మాణ రంగానికి చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో భట్టి విక్రమార్క పేర్కొన్నారు.