Telugu News » YS Sharmila : వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసలుగా మారాయి….!

YS Sharmila : వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసలుగా మారాయి….!

కానీ ఈ పదేండ్లలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయాంలో వ్యవసాయాన్ని దండగ అనేలా చేశారని తీవ్రంగా మండిపడ్డారు.

by Ramu
ys sharmila is Fire on jagan government

వైసీపీ (YCP)సర్కార్ పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా (YS Sharmila) తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ (YSR) హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదన్నారు. కానీ ఈ పదేండ్లలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయాంలో వ్యవసాయాన్ని దండగ అనేలా చేశారని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ ఫైర్ అయ్యారు.

ys sharmila is Fire on jagan government

రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా తాయారైందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా బాగోలేదని ధ్వజమెత్తారు. గుంటూరులో రోడ్లు మరీ అధ్వాన్నంగా మారాయని అన్నారు. ఇది గుంటూరా?, గుంటలూరా? అని ప్రశ్నించారు.

రోడ్లు వేసేందుకు, ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలనకు, జగన్ పాలనకు చాలా తేడా ఉందని వెల్లడించారు. అందరికీ సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ పనిచేశారని తెలిపారు. కానీ జగన్ మాత్రం సొంత ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు.

ప్రస్తుతం సబ్సిడీలు, పంటనష్టం పరిహారాలు ఏమీ ఇవ్వడం లేదని ఆరోపించారు. జగన్ పాలనలో యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. అధికారంలోకి రాకముందు ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాటిచ్చారని…కానీ ఆ తర్వాత వాటిని విస్మరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు.

ఇప్పుడు ఎన్నికల వేళ హడావుడిగా నోటిఫికేషన్లు ఇచ్చారని ఆరోపణలు చేశారు. టీడీపీ, వైసీపీ పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయన్నారు. పదేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ బిల్లు తెచ్చినా ఈ రెండు పార్టీలు మద్దతు ప్రకటించాయని విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్‌లు కల్పించిన ఘనత వైఎస్‌ఆర్‌దేనని గుర్తు చేశారు. నేడు ముస్లింలు, క్రిస్టియన్లకు భరోసా లేదని తెలిపారు.

You may also like

Leave a Comment