Telugu News » అపర్ణ 17 డిగ్రీస్ నార్త్ క్లబ్‌ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

అపర్ణ 17 డిగ్రీస్ నార్త్ క్లబ్‌ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

అపర్ణ 17 డిగ్రీస్ నార్త్ క్లబ్‌ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

by Anjaneya

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ కన్ స్ట్రక్షన్స్ శంకరపల్లి మోకిలా లో ఇటీవల 17 డిగ్రీస్ నార్త్ అనే ఎక్సక్లూసివ్ క్లబ్‌ను ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను ప్రపంచమంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.  ఈ క్లబ్ ఆధ్వర్యంలో ముందుగానే డిసెంబర్ 23 న క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. లైవ్ కన్సర్ట్ తో క్రిస్మస్ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా నగరంలో హాలిడేస్ సెలబ్రేషన్స్ కు ఒక కొత్త వేదికను క్రియేట్ చేసింది 17 డిగ్రీస్ నార్త్ క్లబ్. 

ఈ వేడుకల సందర్బంగా 17 డిగ్రీస్ నార్త్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ క్లబ్ కేవలం మరో రొటీన్ క్లబ్ కాదని.. కొత్త జీవన విధానానికి నాంది అని తెలిపారు. ఇది అత్యంత ప్రముఖ వ్యక్తులతో జాగ్రత్తగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ అని వివరించారు. ఈ క్లబ్ లో సభ్యుల ఎంపిక ప్రక్రియ జాగ్రత్తగా పరిశీలించి తీసుకుంటారని చెప్పారు. మున్ముందు రోజుల్లో ఈ క్లబ్ ప్రయాణం మరింత అద్భుతంగా ఉంటుందని చెప్పారు. 

17 డిగ్రీస్ నార్త్ క్లబ్ ఎదగడం చూసి తాము చాలా సంతోషిస్తున్నామని అన్నారు రామకృష్ణ. రాబోయే రోజుల్లో జరిగే ఈవెంట్స్ కు ఈ క్రిస్మస్ వేడుక అనేది కేవలం ఒక టీజర్ లాంటిదని.. నూతన సంవత్సరం సందర్భంగా ఇప్పటికే పలు కార్యక్రమాలకు ప్లాన్ చేసినట్టు వివరించారు. 

ఆరోగ్య, సాంకేతిక, ఆర్థిక, హాస్పిటాలిటీ, ఐటీ, రియల్ ఎస్టేట్.. ఇలా ప్రతి రంగంలోని ప్రముఖులు క్లబ్ మెంబర్షిప్ తీసుకున్నారు. రానున్న రోజుల్లో సభ్యులకి బౌలింగ్ అలె, VR గేమింగ్ అందుబాటులో ఉండబోతుందని, ప్రత్యేక కమ్యూనిటీని సృష్టించడమే తమ లక్ష్యమని అన్నారు.

You may also like

Leave a Comment