Telugu News » Hair loss : జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..!

Hair loss : జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..!

జుట్టు కుదుళ్లకు సరిగ్గా పోషకాలు(Nutrients)అందక అవి బలహీనపడి కూడా జుట్టు రాలే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు (Health professionals) అంటున్నారు.. కాగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది బయట మార్కెట్ లో లభించే నూనెలను, యాంటీ హెయిర్ ఫాల్ షాంపులను వాడుతూ ఉంటారు. వీటికంటే ప్రకృతి సహజంగా లభించే కలబందను వాడితే జుట్టు సమస్యల నుంచి బయటపడవచ్చు..

by Venu

ఒక మనిషి అందాన్ని మరింతగా కనబడేలా చేయడంలో జుట్టు పాత్ర కూడా ఉంటుంది. ఒక్కొక్క సారి మీరు ఎంత అందంగా ఉన్నా జుట్టు లేకుండా ఊహించుకొని చూడండి.. మీకు మీరే ఏదోలా కనిపిస్తారు. అందుకే అందంగా కనబడాలని అనుకొనే వారు జుట్టు (Hair) విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. మరికొంత మంది అయితే జుట్టు కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కూడా కేటాయిస్తారు. ఇక తలపై ఉన్న జుట్టు రాలిపోతుందంటే వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఒత్తిడి, లేదా ఎక్కువగా ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల జుట్టు రాలే సమస్య ఉంటుందని అంటున్నారు నిపుణులు.

జుట్టు కుదుళ్లకు సరిగ్గా పోషకాలు(Nutrients)అందక అవి బలహీనపడి కూడా జుట్టు రాలే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు (Health professionals) అంటున్నారు.. కాగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది బయట మార్కెట్ లో లభించే నూనెలను, యాంటీ హెయిర్ ఫాల్ షాంపులను వాడుతూ ఉంటారు. వీటికంటే ప్రకృతి సహజంగా లభించే కలబందను వాడితే జుట్టు సమస్యల నుంచి బయటపడవచ్చు.. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా ఒక గిన్నెలో నూనె తీసుకొని, దాన్ని వేడి చెయ్యాలి.. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును తీసుకొని నూనెలో బాగా కలపాలి. తర్వాత అది చల్లారే వరకు ఆగాలి.. ఈ ఆయిల్ ని రాత్రి పడుకునే ముందు జుట్టుకు బాగా పట్టించాలి. నూనె కుదుళ్లల్లోకి ఇంకేలా మర్దనా చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది..

జుట్టు రాలడం తగ్గడం కోసం ఆరోగ్య నిపుణులు చెప్పిన మరొక చిట్కా.. ముందుగా కలబంద గుజ్జును తీసుకొని.. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసాన్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి.. ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు కలబంద గుజ్జును నేరుగా జుట్టుకు రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు..

జుట్టును చిక్కులు లేకుండా బాగా దువ్విన తరువాత కలబంద గుజ్జును నేరుగా జుట్టుకుదుళ్ల పై రాసి మర్దనా చేయాలి. ఒక గంట తరువాత షాంపుతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు రాలడం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా ఇలా చెయ్యడం వల్ల జుట్టు ఒత్తుగా, అందంగా మెరుస్తూ ఉంటుందని.. చుండ్రు సమస్యలు కూడా తగ్గిపోతాయని అంటున్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలు చెప్పడం జరిగింది.. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి.

You may also like

Leave a Comment