Telugu News » Viral News: రూ.6.50కోట్ల విత్‌డ్రా.. బ్యాంకు సిబ్బందికి చుక్కలు చూపించిన కస్టమర్..!

Viral News: రూ.6.50కోట్ల విత్‌డ్రా.. బ్యాంకు సిబ్బందికి చుక్కలు చూపించిన కస్టమర్..!

ఓ చైనీస్ మిలినీయర్ (Chinese Millionaire) ఘనకార్యమిది. ఒకేసారి రూ.6.50 కోట్లను విత్‌డ్రా చేసిన అతడు.. ఆ మొత్తాన్ని మెషిన్లతో కాకుండా చేతులతో లెక్కించి ఇవ్వాలని చెప్పడంతో బ్యాంకు సిబ్బంది నోరెళ్లబెట్టారు.

by Mano
Viral News: Withdrawal of Rs. 6.50 crores.. The customer who showed dots to the bank staff..!

మీదగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి.. మీరేం చేస్తారు.. అంత డబ్బు నిజంగానే ఉంటే ఆ డబ్బునంతా చేత్తోనే లెక్కిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. డబ్బును చూసిన ఆనందంలో మహా అంటే కొన్ని లక్షల నగదును అలా చేత్తో లెక్కిస్తారు. ఆ తర్వాత డబ్బుల మిషన్‌తో లెక్కించేస్తారు. ఏ బ్యాంకులో అయినా పెద్దమొత్తంలో ఉన్న డబ్బంతా మిషన్లతోనే లెక్కిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే.

Viral News: Withdrawal of Rs. 6.50 crores.. The customer who showed dots to the bank staff..!

అయితే ఓ కస్టమర్ మాత్రం బ్యాంకు సిబ్బందికి చుక్కలు చూపించాడు. తన డబ్బు తీసుకోవడానికి బ్యాంకు వెళ్లిన ఆ వ్యక్తి కండీషన్ విన్న బ్యాంకు సిబ్బంది కంగుతిన్నారు. ఓ చైనీస్ మిలినీయర్ (Chinese Millionaire) ఘనకార్యమిది. ఒకేసారి రూ.6.50 కోట్లను విత్‌డ్రా చేసిన అతడు.. ఆ మొత్తాన్ని మెషిన్లతో కాకుండా చేతులతో లెక్కించి ఇవ్వాలని చెప్పడంతో బ్యాంకు సిబ్బంది నోరెళ్లబెట్టారు. ఈ విషయాన్ని చైనీస్ వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది.

కరోనా సమయంలో 2021లో ఈ సంఘటన జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫ్ షాంఘై (Bank of Shanghai) నుంచి చైనీస్ మిలినీయర్ ఒకరు రూ.6.50కోట్లు విత్‌డ్రా (Withdrew) చేశాడు. ఆ తర్వాత అక్కడి సిబ్బందితో వాటిని చేతితో లెక్కించి తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొదట ఆ మాట విన్న బ్యాంక్ స్టాఫ్‌కు అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇదంతా అయ్యేపని కాదు.. మెషిన్లతో మాత్రమే లెక్కించి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

కానీ, మిలినీయర్ వారి మాట వినలేదు. చేతితో లెక్కించి ఇచ్చిన తర్వాతే అక్కడి నుంచి కదులుతానని భీష్మించి కూర్చున్నాడు. దీంతో చేసేదేమీలేక బ్యాంకు సిబ్బంది అతను చెప్పినట్టే చేయాల్సి వచ్చింది. రెండు గంటల పాటు కూర్చొని బ్యాంకు సిబ్బంది ఆ పని పూర్తి చేశారు. ఆ తర్వాత ఆ నగదును మిలినీయర్‌కు అప్పగించారు. అలా బ్యాంకు సిబ్బంది నుంచి తీసుకున్న ఆ మొత్తాన్ని సూట్‌కేసుల్లో సర్దుకుని అక్కడి నుంచి ఇంటికి బయల్దేరాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

You may also like

Leave a Comment