ఇంట్లో షుగర్ తక్కువైనా ఫర్వాలేదు కానీ ఒంట్లో మాత్రం షుగర్ పెరగకుండా చూసుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో మనుషులకు రోగాలు కామన్ గా మారిపోయాయి.. అందులో బీపీ (BP) షుగర్ (sugar) అయితే ఎప్పుడు ఒంట్లోకి చేరుతాయో తెలియదు కానీ వీటికి ఎంట్రన్స్ మాత్రమే తెలుసు ఎగ్జిట్ ఉండదు. అందుకే షుగర్ రాకముందే జాగ్రత్తగా ఉండాలంటారు వైద్యులు (Doctors)ఒకవేళ వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతున్నారు. మరి వైద్యులు చెప్పిన ఆహార నియమాలు (Dietary Rules) ఏంటో తెలుసుకుందాం..
టీ-కాఫీలు తాగడం మానేయాలి.. ఈ అలవాటు మానకపోతే షుగర్ ఫ్రీ తో వీటిని సేవించాలి అంటున్నారు నిపుణులు.. అలాగే ఇంట్లో తయారు చేసే స్వీట్ రెసిపీలలో చక్కెర లేకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.. పండ్ల రసాల్లో కూడా పంచదార కలపకూడదు. అసలు షుగర్ ఉన్న వారు చక్కెర ఉన్న పానీయాలు తీసుకోవడం పూర్తిగా మానుకోవాలని తెలుపుతున్నారు.
అలాగే చక్కెరని ఎక్కువగా ఉపయోగించే కుకీలు, కేకులు, పేస్ట్రీలు, ఐస్‌క్రీములు, క్యాండీలతోపాటు స్వీట్లు వంటి డెజర్ట్‌లకు చాలా దూరంగా ఉండాలని, లేదా పూర్తిగా తినడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇక ప్రాసెస్డ్ ఫుడ్స్ అయిన టమాటో సాస్, సలాడ్ డ్రెస్సింగ్ వంటి వాటిలో కూడా చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన పండ్ల రసాలు ఇంకా ఫ్రోజెన్ ఫుడ్స్‌లో కూడా చక్కెర ఉంటుంది కాబట్టి వీటి జోలికి వెళ్లకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వైట్ బ్రెడ్ లో కూడా షుగర్ ఎక్కువగా ఉంటుదని ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఈజీగా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే వీటిని తినకూడదని తెలుపుతున్నారు.
షుగర్ వ్యాధి ఉన్న వారు చికెన్, చేపలు, పప్పులు వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తినడం మేలని నిపుణులు అంటున్నారు. అలాగే క్వినోవా, బ్రౌన్ రైస్, వోట్స్, వోట్మీల్ వంటి ఆహారాలు ఫైబర్‌తో నిండి ఉంటాయి. బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు మేలు చేస్తాయని తెలుపుతున్నారు. వాల్‌నట్‌లు, బాదం, చియా గింజలు, అవిసె గింజల్లో ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోవడం మంచిదని అంటున్నారు నిపుణులు.
ఎండుద్రాక్ష, ఖర్జూరం, వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్ కూడా సరిగ్గా ఉంటాయని ఆరోగ్య నిపుణులు (Health Professionals) చెబుతున్నారు. మరోవైపు తాజా కూరగాయల్లో విటమిన్ ఎ, సి, కె, మెగ్నీషియం, ఐరన్ ఇంకా ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని పోషకాహార లోపాన్ని పూరించడంలో ఇవి సహాయపడతాయని వెల్లడించారు ఆరోగ్యనిపుణులు. అయితే అతి ఏదైనా అనర్థమే అందుకే మితంగా తీసుకోవడం ఉత్తమం అంటున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలు చెప్పడం జరిగింది.. వీటిని ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి..