Telugu News » Ram charan: రామ్ చరణ్ మరో అరుదైన ఘనత.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్‌..!

Ram charan: రామ్ చరణ్ మరో అరుదైన ఘనత.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్‌..!

రీసెంట్‌గా 'ఆర్ఆర్ఆర్'(RRR) చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఆస్కార్ 'యాక్టర్స్ బ్రాంచ్'(Ascor Actors Branch)లో సభ్యత్వం పొందగా ఇప్పుడు చరణ్ కూడా ఈ అరుదైన గౌరవాన్ని పొందారు.

by Mano
Ram Charan: Another rare feat of Ram Charan.. Happy fans..!

మెగా పవర్ స్టార్(Mega Power Star) రామ్ చరణ్(Ram Charan) మరో అరుదైన ఘనత సాధించారు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్'(RRR) చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఆస్కార్ ‘యాక్టర్స్ బ్రాంచ్'(Oscar Actors Branch)లో సభ్యత్వం పొందగా ఇప్పుడు చరణ్ కూడా ఈ అరుదైన గౌరవాన్ని పొందారు. దీనిని అకాడమీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీంతో మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు హాట్ టాపిక్‌గా మారింది.

Ram Charan: Another rare feat of Ram Charan.. Happy fans..!

ఈ సందర్భంగా ఆస్కార్ నిర్వాహకులు మాట్లాడుతూ.. “ఈ అద్భుతమైన నటులను మా యాక్టర్స్ బ్రాంచ్‌లో ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో అంకిత భావంతో ఈ నటులు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణంపోశారు. గుర్తుండిపోయే పాత్రలను బహుమతిగా అందించారు. వారి కళతో సాధారణ సినిమాతోనూ ప్రేక్షకులకు అసాధారణ అనుభవాన్ని అందిస్తున్నారు. భావోద్వేగాలను పంచుతూ మంచి అనుభూతిని అందిస్తున్నారు’ అని ప్రశంసలు కురిపించారు.

రామ్ చరణ్‌కు అవార్డు ఇంతటి అరుదైన గౌరవం లభించడంతో సినీ ప్రియులు, మెగా అభిమానులు ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. చరణ్ పాటు హాలీవుడ్ నటులు లషనా లించ్, విక్కీ క్రీప్స్, లూయిస్‌ కూ టిన్ లోక్, కెకె పామర్, చాంగ్ చెన్‌లకూ ఈ ఘనతను అందుకున్నారు.

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ అనే పొలిటికల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు సమాచారం. చరణ్ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత చరణ్… ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా తీయనున్నట్లు సమాచారం.

You may also like

Leave a Comment