Telugu News » ఇటలీలో పెళ్లి చేసుకున్న.. స్టార్ సెలబ్రిటీస్ ఎవరో తెలుసా..?

ఇటలీలో పెళ్లి చేసుకున్న.. స్టార్ సెలబ్రిటీస్ ఎవరో తెలుసా..?

by Sravya

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఇటలీలో వీళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. నటి లావణ్య త్రిపాఠి నటుడు వరుణ్ తేజ్ ఇటలీలో మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. వీళ్ళిద్దరూ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వీళ్ళ పెళ్లిని ఇటలీలో ఘనంగా జరిపారు. అయితే కేవలం ఈ జంట కాదు ఇటలీలో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు పలువురు ఉన్నారు.

వాళ్ళ వివరాలను కూడా చూసేద్దాం. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కంటే ముందు ఇటలీలో పలువురు పెళ్లిళ్లు జరిగాయి. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ఆదిత్య చోప్రా పెళ్లి ఇటలీలో జరిగింది. వీళ్ళ పెళ్లి 2014లో జరిగింది. అలానే బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ పెళ్లి కూడా ఇటలీలోనే జరిగింది.

Also read:

ఇతను కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. 2017లో వీళ్ళ పెళ్లి జరిగింది. బాలీవుడ్ బ్యూటీ సుర్వీన్ చావ్లా బిజినెస్మెన్ అక్షయ్ ఠాకూర్ ని సీక్రెట్ గా ఇటలీలోనే పెళ్లి చేసుకున్నారు. 2017లో వాళ్ళ పెళ్లి జరిగింది. ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లి కూడా ఇటలీలోనే జరిగింది. ఇలా ఈ సెలబ్రెటీల పెళ్లిళ్లు ఇటలీలోనే జరిగాయి.

 

You may also like

Leave a Comment