సూపర్ సార్ మహేష్ బాబు భార్య నమ్రత గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలీ విషయాలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. నమ్రత కూడా ఒక హీరోయిన్. పెళ్లి తర్వాత సినిమాలకి దూరమయ్యారు కానీ ముందు తెలుగు ప్రేక్షకులకు సినిమాలుతోనే దగ్గరయ్యారు. మహేష్ బాబు నమ్రతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ లవ్ మ్యారేజ్. చాలా అన్యోన్యంగా వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలు చేయడం మానేసింది. మహేష్ బాబు ని పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీ వుమెన్ గా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
మొదట నమ్రత తో పెళ్లి అంటే సూపర్ స్టార్ కృష్ణ వద్దని అన్నారట దానికి కారణం మహేష్ బాబుకి ఆంధ్ర అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని ఆయనకి ఉంది. పైగా ఇక్కడ పద్ధతులు ఆంధ్ర అమ్మాయికి తెలిసి ఉంటాయి. కానీ నార్త్ అమ్మాయికి తెలియవు కాబట్టి కృష్ణ వద్దనుకున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం నమ్రతని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. దీంతో కృష్ణ అంగీకరించక తప్పలేదు తర్వాత ఇద్దరినీ చూసి కృష్ణ సంతోషంగా ఉండేవారు. 1977 జనవరి 22న నమ్రత పుట్టింది.
నమ్రత శిరోద్కర్ తండ్రి నితిన్ శిరోత్కర్ అప్పట్లో క్రికెటర్ గా రాణించేవారు. ముంబై తరఫున ఆడి దేశవాళీ క్రికెట్లో నంబర్ వన్ తండ్రి ఎంతో పేరు సంపాదించుకున్నారు దిలీప్ వెంగా సర్కార్ సునీల్ గవాస్కర్ వంటే స్టార్ క్రికెటర్లతో నితిన్ శిరోద్కర్ క్రికెట్ ఆడేవారు. ఆయన ఆట తీరు చూసి క్రికెటర్లు ఆశ్చర్యపోయేవారట. ఆయన అద్భుతమైన బౌలర్గా రాణించారు. నమ్రత తల్లి కూడా సెలబ్రిటీ ఏ. ఆమె తల్లి సైతం మోడల్ గా రాణించారు.