Telugu News » పనిచేసినా మొదటి సినిమా ని ఇంటిపేరుగా మార్చుకున్న.. సెలబ్రెటీలు వీళ్ళే…!

పనిచేసినా మొదటి సినిమా ని ఇంటిపేరుగా మార్చుకున్న.. సెలబ్రెటీలు వీళ్ళే…!

by Sravya

టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు వాళ్ళ సినిమాలతో ఆ సినిమా పేర్లను ఇంటిపేర్లుగా మార్చేసుకున్నారు. ఫస్ట్ సినిమా హిట్ అవడంతో అలా జరుగుతూ ఉంటాయి. అలా సినిమా పేర్ల ని ఏకంగా ఇంటిపేర్లు గా మార్చుకునే వాళ్ళ గురించి చూసేద్దాం. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇంటిపేరు సిరివెన్నెల కాదు. ఆయన మొదటిసారి వర్క్ చేసిన సిరివెన్నెల ఆయనకి ఇంటిపేరుగా మారిపోయింది. కే విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాటతో మంచి గుర్తింపుని తెచ్చుకుని సిరివెన్నెల సీతారామశాస్త్రి అయిపోయారు.

అల్లరి నరేష్ కూడా అల్లరి సినిమాతో అల్లరి నరేష్ అయిపోయారు. నైజాంలో డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న రాజు ప్రొడ్యూస్ చేసిన దిల్ సినిమాతో దిల్ రాజు అయిపోయారు. వెన్నెల సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కిషోర్ వెన్నెల కిషోర్ గా మారిపోయారు. తన కామెడీ టైమింగ్ తో ఎప్పుడూ అందరినీ బాగా అలరిస్తూ ఉంటారు.

Also read:

సత్యం సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చిన రాజేష్ సత్యం రాజేష్ గా పాపులర్ అయ్యాడు. వీళ్లే కాదు జానకి కూడా షావుకారు సినిమాతో వెండి తెరకి పరిచయమయ్యారు ఆ సినిమాలో ఆమె నటించడంతో షావుకారు జానకిగా ఆమె కంటిన్యూ అయిపోయారు. అలానే పాపులర్ అయిపోయారు ఇలా వీళ్ళందరూ కూడా మొదటి సినిమాతో సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చుకున్నారు అలానే పాపులర్ అయ్యారు.

You may also like

Leave a Comment