Telugu News » Chandra Mohan: విలక్షణ నటనతో తెలుగు సినిమాను సమ్మోహన పరిచిన నటుడు చంద్ర మోహన్..!

Chandra Mohan: విలక్షణ నటనతో తెలుగు సినిమాను సమ్మోహన పరిచిన నటుడు చంద్ర మోహన్..!

మొత్తంగా 55 ఏళ్ల నుంచీ తెలుగు సినిమాతో కలసి నడుస్తున్న అనుభవం.. కలిపితే చంద్రమోహన్(Chandramohan). ‘రంగుల రాట్నం’తో కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

by Mano
chandra mohan

చంద్ర మోహన్.. ఒకప్పటి హీరో.. తర్వాత కామెడీ హీరో.. ఆ తర్వాత టాలీవుడ్(Tollywood) ఫాదర్, బ్రదర్, అంకుల్.. క్యారెక్టర్లన్నీ ఆయనవే. మొత్తంగా 55 ఏళ్ల నుంచీ తెలుగు సినిమాతో కలసి నడుస్తున్న అనుభవం.. కలిపితే చంద్రమోహన్(Chandramohan). ‘రంగుల రాట్నం’తో కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

chandra mohan

చంద్ర మోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఆయన 1945, మే 23న కృష్ణాజిల్లాలో జన్మించారు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్‌లో డిగ్రీ చేశారు. చంద్రమోహన్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రఖ్యాత దర్శకుడు కే విశ్వనాథ్‌కు కజిన్ అవుతారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా చంద్రమోహన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. అప్పట్లో చంద్రమోహన్ సరసన హీరోయిన్‌గా చేసిన వారి అదృష్టం కలిసి వస్తుంది అనేవారు. కట్ చేస్తే ఎక్కడికో వెళ్లేది వారి కెరీర్. అంతటి లక్కీ హ్యాండ్ చంద్రమోహన్‌ది అనేవారు. చంద్ర మోహన్‌తో నటించిన తర్వాతే శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి వంటి ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా రాణించారు.

తొలినాళ్లలో ‘కొత్త నీరు’ వంటి చిత్రాలతో సీరియస్ హీరోగా నటించిన చంద్రమోహన్ తర్వాత తన పంథా మార్చుకున్నారు. ‘బంగారు పిచుక’ వంటి సినిమాల నుంచీ ఆయనలోని కామెడీ యాక్టర్ బయటికొచ్చారు. ‘గంగ మంగ’ వంటి కొన్ని చిత్రాల్లో విలనిజం చూపించారు. ఆయన మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ఆయన మృతితో సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగింది.

You may also like

Leave a Comment