Telugu News » Virat Kohli: విరాట్ కోహ్లీ ముఖంపై గాయాలు.. అసలు ఏమైంది..?

Virat Kohli: విరాట్ కోహ్లీ ముఖంపై గాయాలు.. అసలు ఏమైంది..?

కోహ్లీ తెలుపు రంగు టీ షర్ట్ వేసుకున్నాడు. ఎడ‌మ క‌న్ను న‌ల్ల‌గా క‌మిలిపోయి ఉంది. కుడి చెంప‌, ఎడ‌మ‌వైపు నుదురు భాగంలో చిన్న గాటులాంటి గాయం ఉంది. ముక్కుపై బ్యాండేజీతో కనిపించాడు.

by Mano
Virat Kohli: Injuries on Virat Kohli's face.. What actually happened..?

సొంత గ‌డ్డ‌పై జ‌రిగిన వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌(ODI World Cup 2023)లో విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డులు తిర‌గ‌రాశాడు. వ‌న్డేల్లో 50వ సెంచ‌రీతో క్రికెట్ లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్(Sachin Tendulkar) రికార్డు బ‌ద్దలు కొట్టిన విరాట్ సోమ‌వారం ఇన్‌స్టాగ్రాంలో చేసిన ఓ పోస్ట్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

Virat Kohli: Injuries on Virat Kohli's face.. What actually happened..?

దీనికి కారణం విరాట్ కోహ్లీ షేర్ చేసిన ఫొటోలో గాయాలతో కనిపించాడు. అందులో కోహ్లీ తెలుపు రంగు టీ షర్ట్ వేసుకున్నాడు. ఎడ‌మ క‌న్ను న‌ల్ల‌గా క‌మిలిపోయి ఉంది. కుడి చెంప‌, ఎడ‌మ‌వైపు నుదురు భాగంలో చిన్న గాటులాంటి గాయం ఉంది. ముక్కుపై బ్యాండేజీతో కనిపించాడు. దీంతో అసలు కోహ్లీకి ఏమైందని ఫ్యాన్స్‌ కంగారు పడిపోతున్నారు. క్షణాల్లో ఈ ఫొటో నెట్టింట వైరల్ అయింది.

అయితే.. ఆ ఫొటోకు కోహ్లీ ‘మీరు మ‌రొక వ్య‌క్తిని చూస్తారు..’ అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. అంతేకాదు.. కోహ్లీ నవ్వుతూ విక్టరీ సింబల్ చూపించాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కోహ్లీ చేసిన పోస్టులో ఏదో గూడార్థం దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ 17వ సీజ‌న్‌కు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కోహ్లీని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ మ‌రుస‌టి రోజే అంటే.. న‌వంబ‌ర్ 27న కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడం గమనార్హం.

విరాట్‌ ఆర్సీబీని ప్లే ఆఫ్స్ చేర్చేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. అయితే.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ బాదినా.. శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ కొట్ట‌డంతో బెంగ‌ళూరు ఇంటిదారి ప‌ట్టింది. ఇటీవల వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కోహ్లీ రెండు సెంచరీల‌తో క‌లిపి 765 ర‌న్స్ కొట్టాడు. అత్య‌ధిక ప‌రుగుల వీరుడిగా నిలిచి.. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ అవార్డు అందుకున్నాడు.

You may also like

Leave a Comment