Telugu News » IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా.. మూడు ఫార్మాట్‌లకు వేర్వేరు సారథులు..!

IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా.. మూడు ఫార్మాట్‌లకు వేర్వేరు సారథులు..!

టీమ్‌ ఇండియా(IND), దక్షిణాఫ్రికా(SA)తో జరగబోయే సిరీస్‌లో భాగంగా ఆదేశంలో డిసెంబర్ 10 నుంచి పర్యటించనుంది.

by Mano
IND vs SA: Team India to tour South Africa.. Different captains for three formats..!

వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్ చేపట్టనున్న తొలి విదేశీ పర్యటనకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్ కోసం టీమ్‌ను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. టీమ్‌ ఇండియా(IND), దక్షిణాఫ్రికా(SA)తో జరగబోయే సిరీస్‌లో భాగంగా ఆదేశంలో డిసెంబర్ 10 నుంచి పర్యటించనుంది.

IND vs SA: Team India to tour South Africa.. Different captains for three formats..!

ఈ సిరీస్‌లో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. రోహిత్‌శర్మ టీ20 కెప్టెన్సీ చేపడతాడా? లేదా? అనే ఉత్కంఠకు తెరదించుతూ మూడు ఫార్మట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించింది. టెస్టు సిరీస్‌కు రోహిత్, వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత జట్టు

టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్‌, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్హీప్ సింగ్, మహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్క్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), మహ్మద్ షమీ, ముఖేష్ కుమార్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ప్రసిద్ధ కృష్ణ, శార్దూల్‌ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్.

వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్‌వర్మ, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, రజత్ పటీదార్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), దీపక్ చాహర్.

భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ షెడ్యూల్ ఇదే

  • తొలి టెస్టు – డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు
  • రెండో టెస్టు – జనవరి 3 నుంచి జనవరి 7 వరకు

 

  • తొలి వన్డే – డిసెంబర్ 17
  • రెండో వన్డే – డిసెంబర్ 19
  • మూడో వన్డే – డిసెంబర్ 21

 

  • తొలి టీ20 – డిసెంబర్ 10
  • రెండో టీ20 – డిసెంబర్ 12
  • మూడో టీ20 – డిసెంబర్ 14

You may also like

Leave a Comment