Telugu News » Sreeleela: కెమెరా ముందుకు రానంటున్న హీరోయిన్ శ్రీలీల.. కారణమదే..!!

Sreeleela: కెమెరా ముందుకు రానంటున్న హీరోయిన్ శ్రీలీల.. కారణమదే..!!

గుంటూరు కారం సినిమా సెట్స్‌కి ఒక వారం రోజులు దూరంగా ఉండనుంది శ్రీలీల. ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్న కారణంగా ఒక వారం రోజుల పాటు శ్రీలీల షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు.

by Mano
Sreeleela: Heroine Sreeleela doesn't want to come in front of the camera.. there is a reason..!!

హీరోయిన్స్‌ శ్రీలీల(Sreeleela)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఈ మధ్య బాగా బిజీ అయింది ఈ బ్యూటీ. ధమాకా(Dhamaka) సినిమాతో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన శ్రీలీలకు ప్రస్తుతం కష్టాలు తప్పడం లేదు. అయితే దీనికి కారణం లేకపోలేదు.

Sreeleela: Heroine Sreeleela doesn't want to come in front of the camera.. there is a reason..!!

శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు ఇటీవల విడుదలై ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమాల్లో శ్రీలీల నటనకూ అంతగా మార్కులు పడలేదు. డాన్స్, ఇమేజ్‌తో సినిమాల్లో నెగ్గుకురావడం కష్టమని ఈ బ్యూటీ చూస్తేనే స్పష్టమవుతోంది. ఆయా సినిమాల్లో శ్రీలీలకు తగిన ప్రాధాన్యతనూ ఇవ్వలేదు డైరెక్టర్లు.

Sreeleela: Heroine Sreeleela doesn't want to come in front of the camera.. there is a reason..!!

ముఖ్యంగా శ్రీలీల కోసం సినిమాకు వెళ్లిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దీంతో శ్రీలీల కథల ఎంపికలో కాస్త జాగ్రత్త పడితే బాగుండని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మధ్య కాలంలో బాలయ్య చేసిన భగవంత్ కేసరి సినిమాలో తప్ప శ్రీలీలకు పేరు తెచ్చిపెట్టిన సినిమా ఒక్కటీ లేదు.

Sreeleela: Heroine Sreeleela doesn't want to come in front of the camera.. there is a reason..!!

ఇక శ్రీలీల ఆశలన్నీ మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’పైనే ఉన్నాయి. ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం సినిమా సెట్స్‌కి ఒక వారం రోజులు దూరంగా ఉండనుంది శ్రీలీల. ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్న కారణంగా ఒక వారం రోజుల పాటు శ్రీలీల షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. దీంతో తిరిగి ఎగ్జామ్స్ పూర్తయ్యాక సెట్స్‌లోకి వచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment