Telugu News » Salaar Telugu Review: ప్రభాస్ సలార్ సినిమా కథ, రివ్యూ & రేటింగ్…!

Salaar Telugu Review: ప్రభాస్ సలార్ సినిమా కథ, రివ్యూ & రేటింగ్…!

by Sravya

Salaar Telugu Review: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ అయ్యింది. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, రామచంద్రరాజు, మైమ్ గోపి, ఝాన్సీ, టినూ ఆనంద్ తదితరులు నటించారు. భువన గౌడ సినిమాటోగ్రఫీ అందించారు. విజయ్ కిరగందూర్ నిర్మించారు. రవి బస్రూర్
సంగీతాన్ని అందించారు. ఇప్పుడు సలార్ పార్ట్ 1 వచ్చేసింది. కథ రివ్యూ అలానే రేటింగ్ వివరాలని చూద్దాం.

నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, రామచంద్రరాజు, మైమ్ గోపి, ఝాన్సీ, టినూ ఆనంద్ తదితరులు
సినిమాటోగ్రఫీ : భువన గౌడ
సంగీతం: రవి బస్రూర్
నిర్మాత: విజయ్ కిరగందూర్
కథ, కథనం, దర్శకత్వం: ప్రశాంత్ నీల్
విడుదల తేదీ: డిసెంబర్ 22, 2023

స్టోరీ:

స్టోరీ ని చూస్తే… తండ్రికి తెలియకుండా ఆద్య (శృతి హాసన్) ఇండియా కి వచ్చేస్తుంది. ఖాన్సార్ మనుషుల వలన ఆమె కి ప్రమాదం ఉంటుంది. రక్షణ కోసం బిలాల్ (మైమ్ గోపి)కి ఫోన్ చేయగా… దేవా (ప్రభాస్) సూచనల మేరకు ఆద్యను జాగ్రత్తగా అస్సాంలోని మారుమూల గ్రామానికి తీసుకెళ్లడం జరుగుతుంది. దేవా బొగ్గు గనుల్లో వర్క్ చేస్తాడు. తల్లి (ఈశ్వరీ రావు) ఊళ్ళో పిల్లలకు చదువు చెప్తుంటారు. కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసినా కూడా భయపడిపోతుంది. ఎందుకు అలా ఉంటుంది…? ఏడేళ్ళ క్రితం ఏం అయ్యింది..? ఖాన్సార్ కర్త (రాజు) రాజ మన్నార్ (జగపతి బాబు) తర్వాత ఆ కుర్చీ కోసం చూసిన వాళ్ళతో యుద్ధంలో రాజ మన్నార్ రెండో భార్య కొడుకు, తన బాల్య స్నేహితుడు వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)కి సపోర్ట్ గా ఉండాల్సిన దేవా ఏం చేస్తాడనేది తెలియాలంటే సినిమా చూడాలి.

ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్లు బావున్నాయి. ప్రభాస్ కటౌట్ అలానే పర్సనాలిటీకి తగ్గట్టు ప్రశాంత్ నీల్ సినిమా చేసాడు. కానీ కథ & కథనం విషయంలో డిజప్పాయింట్ చేశారు. ఈ మూవీ సెకండాఫ్ కేజీఎఫ్ సినిమాకు లింక్ ఉన్నట్టు కనిపిస్తుంది. సినిమా రెండో పార్టు కోసం కథ ని దాచేసారు. సినిమాలో యాక్షన్ హైలైట్ గా వుంది. ఎమోషన్స్ కూడా బావున్నాయి. పాటలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. సినిమాలో ప్రభాస్ పాత్ర సూపర్బ్. ఈశ్వరీ రావు, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలు కూడా బావున్నాయి.

Also read:

ప్లస్ పాయింట్స్:

ప్రశాంత్ నీల్ డైరెక్షన్
శృతి హాసన్, ప్రభాస్
ఎమోషన్స్
క్లైమాక్స్
అక్కడక్కడా పెట్టిన ఆసక్తికరమైన సీన్స్

మైనస్ పాయింట్స్:

కథ, కథనం
వదిలేసిన ట్విస్ట్స్

ఎవరెవరు ఎలా చేశారంటే..
ప్రభాస్‌(Prabhas) నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పాత్రను సీరియస్‌గా చూపిస్తూ బాగా ఎలివేట్ చేసాడు దర్శకుడు. ఆ క్యారెక్టర్‌కు ప్రభాస్ బాగా సెట్ అయ్యాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విరామం ముందు వస్తాడు, అతను కూడా బాగా చేసాడు. అతనికి, ప్రభాస్‌కి మధ్య వున్న సన్నివేశాలు ఆకర్షణీయంగా ఉంటాయి. శృతి హాసన్ పాత్ర చాలా కీలకం, ఆమెకి వచ్చే సందేహాలను చెప్పడంతోనే కథంతా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో జగపతి బాబు, ఈశ్వరి రావు పాత్రలు హైలెట్. ప్రభాస్‌నే డామినేట్ చేశాయి వారి పాత్రలు. ఝాన్సీ ఇంకో ముఖ్య పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నారు. బ్రహ్మాజీకి ఇందులో వైవిధ్యమైన పాత్ర ఇచ్చారు. ఇక మిగతా నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

చివరగా..
ఈ సినిమా కేవలం ప్రభాస్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని తీసినట్లు అనిపిస్తుంది. హీరో ఎలివేషన్ సీన్స్‌కు కొదువే లేదు. ప్రభాస్ కనబడితే థియేటర్ టాప్ లేచిపోయే రేంజ్‌లో ఎలివేషన్ సీన్స్‌ ఉన్నాయి. సినిమా తొలి 20నిమిషాలు ప్రభాస్ అసలు కనిపించడు. సెకండాఫ్‌లోనూ ప్రభాస్‌కు డైలాగ్స్ ఎక్కువ లేవు. ఇది పూర్తిగా ప్రభాస్ వన్‌మ్యాన్ షో అనే చెప్పాలి. ఇక, శృతిహాసన్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో అని ప్రూవ్ చేశాడు. సినిమా క్లైమాక్స్ ‌కంప్లీట్ అయ్యాక ఎండ్ క్రెడిట్స్ పడే ముందు అదిరిపోయే సీక్వెన్స్‌ పెట్టాడు దర్శకుడు. ఇక సలార్ పార్ట్ 2 టైటిల్ చివరలో రివీల్ చేశాడు.

బలాలు
ప్రభాస్, పృథ్వీరాజ్‌ పాత్రలు, నటన
క్లైమాక్స్
ఖాన్సార్ పట్టణం చుట్టూ సాగే కథ

బలహీనతలు
సెకండాఫ్‌లో కొన్ని సీన్స్
కెజీఎఫ్ మార్క్

రేటింగ్: 3.5

చివరగా.. సలార్ సాలిడ్‌గా ఉంది.

 

 

You may also like

Leave a Comment