Telugu News » NBK 109: పవర్‌ఫుల్ పాత్రలో ఊర్వశి.. టాలీవుడ్ అగ్రహీరోతో సినిమా..!

NBK 109: పవర్‌ఫుల్ పాత్రలో ఊర్వశి.. టాలీవుడ్ అగ్రహీరోతో సినిమా..!

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటేలా నందమూరి బాలకృష్ణతో కలిసి నటించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ఊర్వశి పోలీస్ గెటప్‌లో పవర్‌ లుక్‌లో కనిపించనున్నట్లు టాక్.

by Mano
NBK 109: Urvashi in a powerful role.. Movie with Tollywood's top hero..!

ఊర్వశి రౌటేలా(Urvashi Rautela).. పరిచయం అక్కర్లేని పేరు. ఈ బాలీవుడ్‌ బ్యూటీకి టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అగ్రహీరోల సరసన ఐటమ్ సాంగ్స్‌(Item Songs)లో అలరించింది. గతేడాది మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలో స్టెప్పులేసింది.

NBK 109: Urvashi in a powerful role.. Movie with Tollywood's top hero..!

ఈ భామ ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో కలిసి నటించేందుకు సిద్ధమైంది. అయితే ఈసారి ఊర్వశి ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీ కొల్లి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న NBK 109 సినిమాలో ఈ అమ్మడు నటించనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ చిత్రంలో ఊర్వశి పోలీస్ గెటప్‌లో పవర్‌ ఫుల్ లుక్‌లో కనిపించనున్నట్లు టాక్. బాబీ డియోల్, తెలుగు నటి చాందిని చౌదరి కూడా ఈ యాక్షన్ ప్యాక్ వెంచర్‌లో నటిస్తున్నట్లు తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్పై నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు.

109వ సినిమా కావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా 1980 దశకం నాటి కథతో రూపొందుతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.

You may also like

Leave a Comment