Telugu News » Jayadev Unadkat: నా తల్లి కల నెరవేర్చలేకపోయా.. టీమిండియా క్రికెటర్ ఎమోషనల్..!

Jayadev Unadkat: నా తల్లి కల నెరవేర్చలేకపోయా.. టీమిండియా క్రికెటర్ ఎమోషనల్..!

టీమిండియా యంగ్ ప్లేయర్ జయదేవ్ ఉనద్కత్(Jayadev Unadkat). ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన తల్లిదండ్రులతో ఫొటో దిగారు. ఈ సందర్భంగా ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి భావోద్వేగానికి లోనయ్యారు.

by Mano
Jayadev Unadkat: Unable to fulfill my mother's dream.. Team India cricketer emotional..!

భారత జట్టు(Team India)తో పాటు, ఐపీఎల్‌(IPL)లో అద్భుతంగా రాణించి తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు  టీమిండియా యంగ్ ప్లేయర్ జయదేవ్ ఉనద్కత్(Jayadev Unadkat). ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన తల్లిదండ్రులతో ఫొటో దిగారు.

Jayadev Unadkat: Unable to fulfill my mother's dream.. Team India cricketer emotional..!

ఈ సందర్భంగా ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి భావోద్వేగానికి లోనయ్యారు. అందులో ఆసక్తికరమైన క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. అవార్డు ఫంక్షన్‌లో అమ్మ, నాన్న పాల్గొనడం నాకు చాలా ఆనందంగా, గర్వంగా అనిపించిందని తెలిపాడు. జీవిత రెండు సాధించాలనుకున్నానని, అందులో ఒకటి తాను ఐఐఎమ్ నుంచి డిగ్రీ పొందాలని అమ్మ చిరకాల కోరిక అని తెలిపాడు.

మరొకటి భారత జట్టుకు ఆడటమని పేర్కొన్నాడు. అయితే అందులో రెండోది సాధించాను కానీ, తల్లికి ఎంతో ఇష్టమైన ఐఐఎమ్ డిగ్రీని పొందలేకపోయానంటూ జయదేవ్ ఎమోషనల్ అయ్యాడు. తనకు ఎంతో ఇష్టమైన పని చేసుకుంటూ ఓ స్థాయికి వచ్చానని, ఇది నా తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇస్తుందని భావిస్తున్నానని తెలిపాడు.

ఒక కల నిజమైందంటూ జయదేవ్ ఉనద్కత్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీంతో ఉనద్కత్‌ను ఫ్యాన్స్‌ అభినందిస్తున్నారు. ఏదైనా సాధించాలన్న సంకల్పం ఉన్నప్పుడు ఆ దిశగా వందశాతం శాతం కష్టపడాలి. అలా కష్టపడి అనుకున్నది సాధించిన మీకు అభినందనలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

You may also like

Leave a Comment