లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచారంలో బీజేపీ (BJP) నేతలు స్పీడ్ పెంచారు.. ఒకవైపు రేవంత్ (Revanth) చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానాలు ఇస్తూ.. అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు.. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ (Congress)కు ఎవరూ ఓటు వేయవద్దని కోరారు..
హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో అన్ని పార్టీల కన్నా బీజేపీ ముందంజలో ఉందని తెలిపారు. బీఆర్ఎస్ చాలా బలహీనపడిపోయిందని, దాదాపు కనుమరుగైందని సెటైర్ వేశారు.. ఆ పార్టీ ఓడిపోయి 5 నెలలు గడిచినా, ఇంకా ఓటమిని కేసీఆర్, కేటీఆర్ అంగీకరించడం లేదని అన్నారు.. అవే అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారటం చూసి కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఎద్దేవా చేసిన కిషన్ రెడ్డి.. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు, బీఆర్ఎస్ ఫోన్ల ట్యాంపింగ్ కేసుల్లో నిండా మునిగిందన్నారు.. అయినా అసలేం తెలియనట్లు బీజేపీని విమర్శిస్తోందని మండిపడ్డారు. అదేవిధంగా గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేని స్థితిలో బీఆర్ఎస్ ఉందని వ్యాఖ్యానించారు.. గతంలో కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి పంపారని గుర్తు చేశారు.
అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలను తిరిగి పంపుతున్నారని ఆరోపించిన కిషన్ రెడ్డి.. ఢిల్లీ లిక్కర్ కేసుతో తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ కు ఇచ్చిన మాట మీద నిలబడే పద్దతి ఎప్పుడూ లేదని ఆరోపించారు. ఇక జూన్ 4న రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగుస్తుంది. జూన్ 5 నుంచి పథకాలు అందజేయవచ్చు కదా అని ప్రశ్నించారు.
ఆగస్టు వరకు పెండింగ్ పెట్టడం ఎందుకన్నారు.. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదు సభల్లో ప్రధాని మోడీ ప్రసంగించారని తెలిపిన కిషన్‌రెడ్డి.. 25వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారని పేర్కొన్నారు.. మరోవైపు రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించిన ఆయన.. కాంగ్రెస్ నేతలను అడుగడునా ప్రజలు నిలదీయాలని అన్నారు.. అనంతరం బీజేపీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు బీ ఫామ్ అందజేశారు.