ప్రకృతిని (Nature) నాశనం (Destroying) చేసి అభివృద్ధి (Developing) చెందుతోన్న మనుషుల (Humans) వల్ల ఎన్నో వినాశనాలు (Destructions) ఉత్పన్నం అవుతున్నాయి. అందులో మనిషి అనుకూలంగా జీవించడానికి తప్ప మిగతా జీవరాశులకు ప్రాణసంకటంగా మారుతోంది ఈ భూమి (Earth).. అందుకే అడవులలో ఉండవలసిన జంతువులు, పాములు మనషుల నివాస స్థలాల్లోకి వస్తున్నాయి.
ఇప్పటికే ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట జరుగుతుండటం సూపరిచితమే. ప్రస్తుతం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో హల్చల్ చేసిన 8 అడుగుల భారీ కొండచిలువ వల్ల స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. ద్వారకా తిరుమల, వసంత నగర్ కాలనీ శివారులో ఉన్న పచ్చిక బయళ్ల వద్దకు స్థానిక మేకల కాపరి తన మేకలని తీసుకువెళ్లి మేపుతుంటాడు. అయితే పక్కనే పొదలలో దాగి ఉన్న ఓ భారీ కొండచిలువ మేక పై దాడి చేసి బలంగా చుట్టి చంపేసింది.
మేక మరణించిన అనంతరం ఆ కొండచిలువ మేకను మింగుతుండగా కాపరి గమనించి పెద్దగా కేకలు వేసాడు. అతని కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకొని కర్రలు సహాయంతో కొండచిలువను కొట్టి చంపారు. అయితే తనకు జీవనోపాధి అయిన మేక చనిపోవడంతో ఆ కాపరికి నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నాడు.