Telugu News » KANGANA: ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదలపై హీరోయిన్ కంగన కీలక ప్రకటన!

KANGANA: ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదలపై హీరోయిన్ కంగన కీలక ప్రకటన!

‘ఎమర్జెన్సీ’మూవీ విడుదల గురించి హీరోయిన్ కంగన తాజాగా అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాను మందుగా అనుకున్న సమయానికి నవంబర్ 24న విడుదల చేయడం లేదని పేర్కొంది.

by Mano
KANGANA: Heroine Kangana's key announcement on the release of the movie 'Emergency'!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జెన్సీ (Emergency) అనే సినిమాని తెరకెక్కిస్తోంది. ఈ మూవీకి కంగన స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తోంది. 1977 లో ఇందిరా గాంధీ (Indira Gandhi) ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్న సమయంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

KANGANA: Heroine Kangana's key announcement on the release of the movie 'Emergency'!

సొసైటీలో జరిగే కొన్ని సంఘటనల గురించి ముక్కుసూటిగా మాట్లాడుతూ నిత్యం కాంట్రవర్సీలలో నిలిచే కంగనా ఎమర్జెన్సీ వంటి సెన్సిటివ్ కంటెంట్‌ను ఎలా చూపించబోతుందో అని అందరిలో ఆసక్తి నెలకుంది. ఈ మూవీ విడుదల గురించి ఆమె తాజాగా అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాను మందుగా అనుకున్న సమయానికి నవంబర్ 24న విడుదల చేయడం లేదని పేర్కొంది.

కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాగా ఇటీవల చంద్రముఖి 2 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కంగనా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

You may also like

Leave a Comment