ఇండస్ట్రీకి చాలామంది హీరోయిన్లు వస్తూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే మంచి పేరు తెచ్చుకుంటారు. మంచి పేరు తెచ్చుకుని, ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీదేవి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నటి శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. శ్రీదేవి తెలుగు భాషలోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించారు. ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా నిలిచారు శ్రీదేవి. శ్రీదేవి చనిపోయిన తర్వాత ఆమె కూతురు తన వారసురాలిగా ఇండస్ట్రీ లోకి వచ్చి, ప్రస్తుతం బిజీగా ఉంటోంది.
జగదేకవీరుడు అతిలోకసుందరి శ్రీదేవికి మంచి పేరు తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. సాధారణంగా అప్పుడప్పుడు సినిమాల్లోకి హీరోయిన్లు లేదంటే హీరోల ప్లేస్ లో డూప్ నటిస్తూ ఉంటారు ఎక్కువగా హీరోలకి డూప్లి ఉంటారు శ్రీదేవి కి మాత్రం ఈ సినిమాలో హేమ డూప్ గా నటించారట నటి హేమ శ్రీదేవికి డూప్ కి సినిమాలో నటించడం జరిగింది శ్రీదేవి ఒక సన్నివేశంలో నీళ్లలోకి దిగి ఈదాల్సి ఉంటుంది.
Also read:
కానీ ఆమెకి ఈత రాకపోవడంతో ఈ సన్నివేశంలో హేమ నటించారు. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. నటి హేమ కూడా చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. బ్రహ్మానందం వంటి సీనియర్ ఆర్టిస్టులతో కూడా హాస్యాన్ని పండించి అందర్నీ ఆకట్టుకుంది హేమ. అయితే హేమ ఈ సినిమాలో నటించింది అని చాలా మందికి తెలీదు. ఈ విషయం తెలిసి ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు.