వన్డే ప్రపంచకప్(Oneday world cup)లో భాగంగా పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik pandya) గాయపడిన సంగతి తెలిసిందే. గాయంతో హార్దిక్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయాన్ని కైవసం చేసుకున్నప్పటికీ హార్దిక్ ఆటకు దూరం కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత హార్దిక్ పాండ్య చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్లో హార్దిక్ ఏం అన్నాడంటే.. ‘విజయం సాధించాం. గతం కంటే బలంగా తిరిగి వస్తా’ అని హార్దిక్ ట్వీట్ చేశాడు. దీంతో హార్దిక్ ఫ్యాన్స్ త్వరగా కోలుకో ఛాంప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ కోలుకుని నెక్స్ట్ మ్యాచ్‌కు తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరికొందరు పాండ్యాకు గాయాలు కొత్త కాదని, అతని కమ్ బ్యాక్ గట్టిగా ఉంటుందంటున్నారు.
బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా 9వ ఓవర్‌ను బౌలింగ్ చేసేందుకు వచ్చిన పాండ్య తొలి బంతిని డాట్ బాల్‌గా వేయగా.. తర్వాత రెండు బాల్స్‌కు బౌండరీలు సమర్పించుకున్నాడు. అయితే మూడో బాల్‌ను బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్‌ను ఆపే ప్రయత్నంలో హార్దిక్ గాయపడ్డాడు.కాలు బెనకడంతో టీమిండియా ఫిజియో వచ్చి పరీక్షించాడు. కొంతసేపు తర్వాత బౌలింగ్‌కు సిద్ధమైన పాండ్య ఇబ్బందిపడ్డాడు. దీంతో అతడు మైదానం వీడాడు.
టీమిండియాకు హార్దిక్ పాండ్య చాలా కీలకమైన ప్లేయర్ కావడంతో ఫ్యాన్స్ అతడు లేని ఆటను ఊహించుకుంటూ జీర్ణించుకోలేకపోతున్నారు. హార్దిక్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా నిష్ణాతుడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు బౌలింగ్‌లో ప్రభావం చూపిన పాండ్యకు ఇంకా బ్యాటింగ్ చేసే అవకాశం సరిగ్గా రాలేదు. తర్వాతి మ్యాచ్‌లో అయినా హార్దిక్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.