బాహుబలితో పాన్ ఇండియా(Pan india) ఫార్ములాను తెరపైకి తెచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి(Director rajamouli) పురాణాల కథలనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకురాగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్. తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘మహా భారతం’(Mahabharatham)ను 10 భాగాలుగా తీస్తానని గతంలోనే చెప్పాడు. అయితే ఈ దర్శక ధీరుడికి కంటే ముందు మరో డైరెక్టర్ ‘మహా భారతం’ తీసేందుకు రెడీ అయ్యాడు.
కన్నడ రచయిత ఎన్.ఎల్.బైరప్ప మహాభారతం ఆధారంగా రచించిన ‘పర్వ’ అనే పుస్తకాన్ని బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సినిమా రూపంలో అందించనున్నారు. తన సినిమాకు ‘పర్వ’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్‌ను సైతం వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్(X)లో విడుదల చేశారు. ఈ సినిమా మూడు భాగాలుగా రానున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.
‘ధర్మానికి సంబంధించిన ఓ పురాణకథ’ అనేది ఆయన చేసిన పోస్టుకు ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ సినిమా మూడు భాగాలుగా రానున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని తెలిపాడు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపాడు.
ఇకపోతే రాజమౌళి తీసే ‘మహా భారతం’కు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇది వరకే కొన్ని ఇంటర్వ్యూల్లో రాజమౌళి మాట్లాడుతూ.. మహాభారతం కథ నా మైండ్‌లో ఉన్నది ఉన్నట్లు తీస్తే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి చరిత్ర సృష్టిస్తుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జక్కన్న RRR సినిమా తర్వాత మహేశ్‌బాబుతో ఓ అడ్వెంచర్ సినిమాను తెరెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తయ్యాక ‘మహాభారతం’పై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
BIG ANNOUNCEMENT:
Is Mahabharat HISTORY or MYTHOLOGY?
We, at @i_ambuddha are grateful to the almighty to be presenting Padma Bhushan Dr. SL Bhyrappa’s ‘modern classic’:
PARVA – AN EPIC TALE OF DHARMA.There is a reason why PARVA is called ‘Masterpiece of masterpieces’.
1/2 pic.twitter.com/BiRyClhT5c
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 21, 2023