Telugu News » jaggery : వావ్.. బెల్లంతో ఇన్ని అద్భుతమైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలా..!

jaggery : వావ్.. బెల్లంతో ఇన్ని అద్భుతమైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలా..!

అదీగాక ఈ బెల్లంలో.. చ‌క్కెర‌లో క‌నిపించ‌ని ఐర‌న్‌, క్యాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయని తెలుపుతున్నారు. భారత్ స‌హా దక్షిణాసియా, ద‌క్షిణ అమెరికా, ఆఫ్రికాలోని ప‌లు ప్రాంతాల్లో బెల్లం విరివిగా వాడుతుంటారు. మనదగ్గర అయితే ఎక్కువగా సంప్రదాయ వంటలలో ఉపయోగిస్తారు.

by Venu

బెల్లం (jaggery) దాదాపుగా ప్రతివారి ఇంట్లో విరివిరిగా ఉంటుంది. మనదగ్గర ఈ బెల్లం వాడటం చాలా తక్కువ కానీ దీనివల్ల ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మనదేశంలో అరుదుగా ఉపయోగించే ఈ బెల్లం వల్ల ఉన్న బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే.. స‌హ‌జ‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉండ‌టంతో రిఫైన్డ్ షుగ‌ర్‌కు బెల్లం ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌త్యామ్నాయ‌మ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

అదీగాక ఈ బెల్లంలో.. చ‌క్కెర‌లో క‌నిపించ‌ని ఐర‌న్‌ (Iron) క్యాల్షియం (calcium) పొటాషియం (potassium) యాంటీ ఆక్సిడెంట్లు (antioxidants) పుష్క‌లంగా ఉంటాయని తెలుపుతున్నారు. భారత్ స‌హా దక్షిణాసియా, ద‌క్షిణ అమెరికా, ఆఫ్రికాలోని ప‌లు ప్రాంతాల్లో బెల్లం (Health Benefits) విరివిగా వాడుతుంటారు. మనదగ్గర అయితే ఎక్కువగా సంప్రదాయ వంటలలో ఉపయోగిస్తారు.

ఇక బెల్లంలో హై షుగ‌ర్ కంటెంట్ ఉండ‌టంతో త‌క్ష‌ణ శ‌క్తినీ అందించడాని తోడ్పడుతుంది. అందుకే మ‌ధుమేహులు బెల్లం వాడే ముందు తప్పనిసరిగ్గా వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం మేలు.. మరోవైపు క్యాల‌రీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండ‌టంతో బెల్లాన్ని మితంగా తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. మరి బెల్లం వాడ‌కంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటో చూద్దాం..

ఈ బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి.. అంతే కాకుండా కాలేయం శుభ్ర‌ప‌రుస్తుంది.. జీర్ణ‌క్రియను మెరుగుపరుస్తోంది.. త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తుంది. రుతుక్ర‌మ రుగ్మ‌త‌ల నివార‌ణ‌లో తోడ్పడుతుంది. ర‌క్త‌హీన‌త‌కు చెక్‌ పెడుతోంది. రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్ధ బ‌లోపేతం చేస్తుంది. శ్వాస స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడుతుంది. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌లో తోడ్పడుతుంది. బ‌రువు త‌గ్గుద‌ల‌కి కూడా ఉపయోగపడుతుందని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం.. బెల్లం మితంగా వాడండి.. ఆరోగ్యాన్ని పొందండి..

You may also like

Leave a Comment