Telugu News » Actor Nani: దర్గాలో హీరో నాని ప్రత్యేక ప్రార్థనలు.. ఎగబడిన ఫ్యాన్స్..!

Actor Nani: దర్గాలో హీరో నాని ప్రత్యేక ప్రార్థనలు.. ఎగబడిన ఫ్యాన్స్..!

కడప వెళ్లిన నాని అక్క‌డ‌ ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా(Kadapa Dargha)ను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఆయనకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అంత‌కుముందు కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ స‌మయంలో కూడా నాని కడప ద‌ర్గాను ద‌ర్శించుకున్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

by Mano
Actor Nani: Special prayers for hero Nani in Dargah.

టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని (Nani) హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). ఈ సినిమా డిసెంబరు 7న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా కడప వెళ్లిన నాని అక్క‌డ‌ ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా(Kadapa Dargha)ను సందర్శించారు.

Actor Nani: Special prayers for hero Nani in Dargah.

ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఆయనకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అంత‌కుముందు కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ స‌మయంలో కూడా నాని కడప ద‌ర్గాను ద‌ర్శించుకున్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నానిని చూసేందుకు అభిమానులు ఏగబడ్డారు.

నాని మాట్లాడుతూ.. త‌న‌కు కడప ద‌ర్గాలో మొక్కు ఉంద‌ని, అది తీర్చుకోవాలని ఇక్క‌డ‌కు వచ్చానని.. దర్గాను సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపారు. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘హాయ్ నాన్న’లో టాలీవుడ్ భామ సీతారామం ఫేం మృణాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మలయాళ నటుడు జయరాం కీలక పాత్ర పోషిస్తున్నారు. నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నారు.

You may also like

Leave a Comment