Telugu News » Tamannah Bhatiya: ఇప్పట్లో పెళ్లి ప్లాన్స్ లేవంటున్న మిల్కీబ్యూటీ..!

Tamannah Bhatiya: ఇప్పట్లో పెళ్లి ప్లాన్స్ లేవంటున్న మిల్కీబ్యూటీ..!

by sai krishna

ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లు అవుతోంది. తెలుగులో తమన్నా ఇప్పటికీ బిజీయెస్ట్ హీరోయిన్ గానే ఉంది. ఇన్నేళ్లవుతున్నా ఇంకా మార్కెట్ డోర్స్ తెరుచుకునే ఉన్నాయి. కెరీర్ బిగినింగ్ లో వరుసగా కుర్రహీరో సినిమాలు కుమ్మేసిన మీల్కీ బ్యూటీ..ఇప్పుడు సీనియర్స్ తో కూడా జతకడుతోంది.

ప్రస్తుతం అటు తెలుగులోను ఇటు తమిళ్ లోనూ ఇద్దరు లెజండరీ హీరోస్ తో సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహ రెడ్డి సినిమాలో నటించే అవకాశం వచ్చినా..ఆయనతో డ్యాన్స్ చేసే ఛాన్స్ రాలేదని అప్పట్లో తమన్నా అన్నారు.

కాగా చిరు లేటెస్ట్ మూవీ భోళాశంకర్ సినిమాతో చేయడంతో ఆలోటు కాస్త ఇప్పుడు తీరిపోయిందంటోంది ఈ సుందరి.అంతే కాదు ‘భోళా శంకర్’లో సినిమా మిల్క్ బ్యూటీ సాంగ్లో.. చిరంజీవితో కలిసి ఓ హుక్స్టెప్ చేశారట. మిగతా స్టెప్స్ కూడా చాలా గ్రేస్ఫుల్గా ఉంటాయని చెప్పుకొచ్చింది.

అయితే ఈ పాటకు అంతగా ప్రాక్టీస్ ఏమీ చేయకుండానే షూట్ చేసినట్లు తెలిపారు తమన్నా.ఇక తమిళ్ విషయానికొస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ సినిమా చేసింది.

ఈ సినిమాలో తన పాత్ర చిన్నదే అయినా..భారీ తారాగణముంటుందన్నారు. అయితే ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు గడిచినా.. హీరోల సరసన నటించేటప్పుడు కేవలం పాత్ర గురించే తప్పా.. సహ నటుల వయసు గురించి పట్టించుకోనని తెలిపారు.

వయసులో చిన్నాపెద్దా తేడా లేకుండా అందర్నీ తోటి నటులుగానే చూస్తానని అన్నారు.కాగా ఇంటర్వ్యూలో తన పెళ్లి ప్రస్తావన రాగా.. పెళ్లీడు ముళ్లై గుచ్చుతున్నా తమన్నా మాత్రం పొండీ..! అప్పుడే పెళ్లేంటి..!? అంటూ సింపుల్ గా తోసిపుచ్చింది తమన్నా.

తాను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే మనిషినని..ప్రేమ విషయాన్ని సైతం తానే బయటపెట్టానని తెలిపారు. అలాగే పెళ్లికి ఇప్పట్లో ఎలాంటి ప్లాన్లు లేవు అని..సమయం వచ్చినప్పుడు స్వయంగా తనే ప్రకటిస్తానని తమన్నా అన్నారు.

తనకు ఎప్పుడు సమయమొస్తుందో…ఎప్పుడు ప్రకటిస్తుందో..అని కొందరనుకుంటుంటే..సర్లే అప్పటి దాకా తమన్నా మన సుందరే కదా అనుకుంటున్నారు ఇంకొందరు కుర్రకారు.

ఇక తమిళంలో ‘అరణ్‌మణై’, మలయాళంలో ‘బాంద్రా’ సినిమాలతో కెరీర్లో దూసుకుపోతున్నారు తమన్నా. రీసెంట్గా ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ – 2’ లాంటి వెబ్ సిరీస్లతోనూ ప్రేక్షకును ఆకట్టున్నారు.

You may also like

Leave a Comment