Telugu News » అదా శర్మకు సుస్తి చేసిందట…! ప్రస్తుతం ఎలా ఉందంటే..!?

అదా శర్మకు సుస్తి చేసిందట…! ప్రస్తుతం ఎలా ఉందంటే..!?

by sai krishna

హార్ట్ ఎటాక్ బ్యూట్ ఆదా శర్మ…చాలా కాలం తర్వాత కేరళ స్టోరితో అందరి అటెన్షన్నీ గ్రాబ్ చేసింది. నిజానికి అదాశర్మకి సరైన హిట్ పడి ఏళ్లు గడిచిపోయింది. నితిన్ సరసన హార్ట్ అటాక్ సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

ఈ సినిమా సక్సెస్ సాధించినా కూడా ఈ ముద్దుగుమ్మ మాత్రం టాలీవుడ్‌లో క్లిక్ కాలేకపోయింది. ఆ తరువాత సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ సహా పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఆమె కెరీర్‌కు అయితే ఉపయోగపడలేదు.

ఇన్నాళ్లకు అదాశర్మ కెరీర్‌కు మాంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది.‘ది కేరళ స్టోరీ’ మూవీ రూపంలో అదృష్టం తలుపు పట్టింది.ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు ఆదా శర్మ తలుపు తడుతున్నాయి.

ప్రస్తుతం ‘కమాండో’ సిరీస్‌ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆదా దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉంది.అయితే బుధవారం ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతూ అస్వస్థతకు గురైంది.

కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ‌యేరియాతో పాటు ఫుడ్ అల‌ర్జీతో అదా బాధపడుతోందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అదా శ‌ర్మ వైద్యుల ప‌ర్యవేక్షణలో ఉందని.. ఆమె ఆరోగ్య ప‌రిస్ధితి నిల‌క‌డ‌గా ఉంద‌ని స‌మాచారం.

You may also like

Leave a Comment