Telugu News » దటీజ్ ఖిలాడీ.. హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్..!

దటీజ్ ఖిలాడీ.. హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్..!

by admin
Akshay Kumar Highest Tax Payer in India 1

2022 -23 భారత ఆదాయపన్నుల శాఖ సభకు ఐటీ రిటర్న్స్ దాఖలు ఆఖరి గడువు జూలై 31తో ముగిసింది. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టాక్స్ జూలై 30 వరకూ6 కోట్ల టాక్స్ రిటర్న్స్ ఫైల్ అయినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఇందులో నమోదైన టాప్ టాక్స్ పేయర్ల పేర్లు కూడా ప్రకటించింది. కానీ ఈ లిస్ట్ లో బడా బిజినెస్ మేన్ల పేర్లు టాప్ లో లేకపోవడం గమనార్హం. నిజానికి బడా బిజినెస్ మేన్లు ఎక్కువ ట్యాక్స్ పే చేస్తారని అంతా అనుకుంటారు.కానీ ట్విస్టేంటంటే ఈ అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు టాక్స్ పేయింగ్ ఐటీ శాఖకి ఇచ్చేది అంతంత మాత్రమేనట. అసలు ఆర్థిక శాఖకు అత్యధిక టాక్స్ లు కట్టేది హీరోలేనట.

Akshay Kumar Highest Tax Payer in India

ఆదాయ పన్ను శాఖ అందించిన వివరాల ప్రకారం..హయ్యెస్ట్ ట్యాక్స్ పే చేసే హీరో మరెవరో కాదు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. అక్షయ్ దేశంలోనే అత్యధికంగా ట్యాక్స్ చేస్తున్నాడని పన్నుల శాఖ సంబరపడుతూ చెప్పింది. గతేడాది (2021-22 ఆర్థిక సంవత్సరంలో) కూడా హైయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ కూడా అక్షయ్ కుమారే కావడం విశేషం.2022 లో అక్షయ్ రూ.29.5 కోట్ల ఆదాయపు పన్నును చెల్లించారు. ఆ ఏడాది తన వార్షిక ఆదాయాన్ని రూ.486 కోట్లుగా ప్రకటించారు.

కాగా, బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో అక్షయ్ ముందు వరుసలో ఉంటారు. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుంటారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్ ను కూడా అక్షయ్ నిర్వహిస్తున్నారు.వీటితో పాటు యాడ్స్, బ్రాండ్ అంబాసిడర్ వంటి వాటి ద్వారా కూడా ఆయన భారీగానే ఆదాయాన్ని అర్జిస్తున్నారు. అక్షయ్ ఇంతకు ముందు కూడా అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా ఉన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ యాక్షన్ హీరో ఏకంగా రూ.25.5 కోట్ల ఆదాయపు పన్నును డిపాజిట్ చేశారు.

దేశంలోనే టాప్ ట్యాక్స్ పేయర్స్ లో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా వంటి పారిశ్రామిక దిగ్గజాల పేర్లు కాకుండా అక్షయ్ ఈ జాబితాలో నిలవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే పారిశ్రామిక వేత్తలకు వ్యక్తి గత ఆస్తులు తక్కువ.. అన్నీ కంపెనీల పేరిటే ఉంటాయి. అలాంటప్పుడు ఆదాయాలు కూడా అధికంగా వారివారి కంపెనీల వాటాగా వెళతాయి. దీంతో ఆయా కంపెనీలు వ్యక్తిగత ట్యాక్స్ కు బదులు కార్పొరేట్ ఆదాయపు పన్ను చెల్లిస్తాయి. ఈ కారణంతోనే దేశంలో అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపు దారుగా అక్షయ్ కుమార్ నిలిచారు.

You may also like

Leave a Comment