న్యూజెర్సీ (New Jersey) లో ఆలయ కట్టడం అద్భుతం అంటున్నారు బాలీవుడ్ నటుడు (Bollywood Actor) అక్షయ్ కుమార్ (Akshay Kumar). అమెరికా (America)లోని న్యూజెర్సీలో నూతనంగా ప్రారంభించిన అతిపెద్ద హిందూ దేవాలయం అక్షరధామ్ (Aksharadham) పై స్పందించిన అక్షయ్.. అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయంగా, ప్రపంచంలో రెండవ అతిపెద్ద హిందూ ఆలయంగా అక్షరధామ్ అవతరించడం గర్వించదగ్గ విషయమని ప్రశంసలు కురిపించారు.
సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ లో ఈ దేవాలయంపై ట్వీట్ చేశారు. గురు మహంత్ స్వామి మహారాజ్‌ను దర్శించుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ మందిర నిర్మాణం గుజరాత్‌కు చెందిన బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆధ్వర్యంలో 2011లో ప్రారంభం కాగా, ఇటీవలే ఆలయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
కాగా రూ.150 కోట్లు ఖర్చుతో జరిగిన దేవాలయ నిర్మాణంలో ఉక్కు, ఇనుము ఉపయోగించలేదు. వేలాది సంవత్సరాల పాటు చెక్కుచెదరని రీతిలో దీనిని నిర్మించడం అద్భుతం.. శ్రీకృష్ణుడి అంశగా ఆరాధించే స్వామి నారాయణ్ కొలువు దీరిన ఆలయమే అక్షరధామ్. అందమైన శిల్పాలతో, భారీ గోపురాలతో, అట్టహాసమైన మండపాలతో కళ్లు చెదిరిపోయేలా నిర్మించిన నిర్మాణాలు భక్తుల మదిని తప్పక పరవశింపచేస్తాయి.