టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాధ్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా కష్టపడి టాప్ డైరెక్టర్ పొజిషన్ కు చేరుకున్న పూరి జగన్నాథ్ తెలుగు ఇండస్ట్రీ కి చాలా హిట్స్ నే ఇచ్చాడు. ఇప్పుడు స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్న చాలా మంది హీరోలకు వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ లో సూపర్ హిట్స్ ఇచ్చాడు పూరి. తాజాగా పూరి జగన్నాధ్ తల్లి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. పూరి గురించి పలు విషయాలను ఆమె పంచుకున్నారు.
పూరికి చిన్న తనం నుంచే సినిమాలంటే పిచ్చి ఉందని, కాలేజీ పూర్తి కాగానే సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చి ప్రయత్నాలు స్టార్ట్ చేసాడని చెప్పుకొచ్చారు. ఓసారి పూరీని చూడడానికి హైదరాబాద్ కి వస్తే.. కాళ్ళంతా వాచి సాక్సులు వేసుకోవడానికి కూడా లేకుండా పోయిందని.. అసలిదంతా ఎందుకు ఊరు వెళ్లి పొలం చూసుకుందాం అని చెప్పినా పూరి వినలేదని అన్నారు. సొంతంగా కష్టపడి పైకొచ్చాకా.. పూరి దగ్గర పని చేసే ఓ వ్యక్తి నమ్మించి 80 కోట్లు కొట్టేశాడని పేర్కొన్నారు. ఆ తరువాత ఓ సినిమా వల్ల నష్టం రావడంతో అప్పటికే కొనుక్కున్న ఐదు ఇళ్ళని అమ్మేయాల్సి వచ్చింది.. చివరకు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధపడ్డారు.
పూరి ఫ్రెండ్స్ లో ఒకరు మోసం చేసిన వాడు తెలుసు కదా.. పట్టుకుని కాళ్ళు విరక్కొడదాం అంటే.. పూరీనే ఆపేసాడు. వాడికి ఏ జన్మలోనో రుణపడి ఉంటాం. అందుకే ఈసారి ఇలా అయ్యింది అంటూ సైలెంట్ అయిపోయాడట. ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు కష్టపడతానని.. ఈ విషయాన్నీ ఇక్కడితో వదిలేయాలని పూరి పేర్కొన్నాడట. ఇక ఎవరైనా సాయం అడిగితే కాదని అనకుండా తాను చేయగలిగింది చేసేవాడని అమ్మాజీ పూరి జగన్నాధ్ గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.