Telugu News » Kerala Medico suicide : అమ్మా నన్ను క్షమించు..!

Kerala Medico suicide : అమ్మా నన్ను క్షమించు..!

కారణం ఏంటో తెలియదు. తన గుండెల్లో ఎంత బాధ ఉందో తెలియదు. తన సమస్యలకు చావే పరిష్కారం అనుకుంది ఆ విద్యార్థిని .

by sai krishna

కారణం ఏంటో తెలియదు. తన గుండెల్లో ఎంత బాధ ఉందో తెలియదు. తన సమస్యలకు చావే పరిష్కారం అనుకుంది ఆ విద్యార్థిని . జీవితంలో ఓడిపోయానంటూ సూసైడ్ నోట్ రాసి, తనపై ఆశలు పెట్టుకున్న అమ్మకు క్షమాపణలు చెప్పి ఉరివేసుకుంది.

కేరళకు చెందిన వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. విశాఖపట్నంలో ఆత్మహత్యకు పాల్పడింది. లాడ్జి గదిలో ఉరి వేసుకుని యువతి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

హోటల్ గదిలో సూసైడ్ నోట్(Suicide note)లభించింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ సూసైట్‌ నోట్‌లో పేర్కొంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కేరళ రాష్ట్రం ఒలరిక్కర ప్రాంతానికి చెందిన రమేష్ కృష్ణ అనే యువతి.. చైనాలో ఎంబీబీఎస్(MBBS)ఫోర్త్ ఇయర్ చదువుతోంది.

సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చింది. ఆ తర్వాత ఈనెల 13న ఇంటి నుంచి తిరుగు ప్రయాణమైంది. 18వ తేదీన విశాఖ చేరుకున్న ఆ మెడికో డాబా గార్డెన్స్ లోని లాడ్జి గదిలో అద్దెకు దిగింది.. ఆగస్టు 9వ తేదీన గది ఖాళీ చేసి వెళ్ళిపోయింది.

మళ్లీ తిరిగి ఈనెల 24వ తేదీన విద్యార్ధిని రమేష్ కృష్ణ(Ramesh Krishna)అదే గదికి వచ్చింది. 24న చెక్ అవుట్ చేయాల్సి ఉన్న.. ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో లాడ్జి నిర్వహకులకు అనుమానం వచ్చింది. లోపల నుంచి గడియాపెట్టి ఉండటంతో లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.

టూ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి తలుపును విరగొట్టి లోపలికి వెళ్లారు.లాడ్జి గదిలో ఫ్యానుకు ఉడివేసుకుని వేలాడుతున్నట్టు కనిపించింది మెడికో. పక్కనే మలయాళం భాష(Malayalam language)లో పదాలను ఇంగ్లీషులో రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

‘తన చావుకు ఎవరూ కారణం కాదనీ.. సారీ అమ్మ’అంటూ ఆ సూసైడ్ లో ఉన్నట్టు టూ టౌన్ సిఐ తిరుమలరావు చెబుతున్నారు.అయితే మెడికో.. ఈ నెల 19న చెక్ అవుట్ చేసిన తర్వాత ఈనెల 23 వరకు ఎక్కడికి వెళ్లిందని పోలీసులు ఆరాతిస్తున్నారు. కుటుంబ సభ్యులు వచ్చాక వారిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment