Telugu News » ఈ విషయంలో కీరవాణి తండ్రికి ఎవరు సాటిరారు… అనుపమ్ ఖేర్ పోస్ట్ వైరల్..!

ఈ విషయంలో కీరవాణి తండ్రికి ఎవరు సాటిరారు… అనుపమ్ ఖేర్ పోస్ట్ వైరల్..!

by Sravya

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. కీరవాణి రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పిస్తూ ఉంటాయి. కీరవాణి తండ్రి శివశక్తి దత్త గురించి కూడా పరిచయం చేయక్కర్లేదు. శివశక్తి దత్త వయసు 92 ఏళ్ళు. ఆయన రాసిన పాటలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ నటుల్లో ఒకరైన అనుపమ్ ఖేర్ శివశక్తి దత్త గురించి ఒక పోస్ట్ పెట్టారు. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ప్రతి చోటా దేవుడే ఉంటాడనే శివశక్తి దత్త గారిని చూడడం ఆనందంగా ఉందని ఆయన కామెంట్ చేయడం జరిగింది. శివశక్తి దత్త గారి ఇంటిని చూస్తే పుణ్యక్షేత్రానికి వెళ్లినట్లు ఉంటుందని చెప్పారు. ఆయన ఇల్లు ఒక దేవాలయం అని అన్నారు. శివశక్తి దత్త దేవుళ్ళని గీసి ఇంట్లో చిత్రపటాలని పెట్టుకున్నారని ఆయన చెప్పారు.

Also read:

అలానే శివాజీ మహారాజ్ బొమ్మని కూడా ఇంట్లో పెట్టుకున్నారట అక్కడ ఉన్న అరగంట కూడా ఎంతో విలువైనదని ఆయన అన్నారు. ఆయన గీసిన బొమ్మను నాకు ఇవ్వడం ఎంతో సంతోషంగా అనిపించిందని చెప్పారు. 92 ఏళ్ల వయసులో కూడా ఆయన తన ప్రతిభతో ప్రశంసలు అందుకుంటూ ఉండడంతో నెటిజెన్స్ ఎంతో సంతోషంగా కామెంట్స్ చేస్తున్నారు అనుపమ్ ఖేర్ చేసిన ఈ పోస్ట్ కి 47 కి వేలకి పైగా లైక్స్ వచ్చాయి.

You may also like

Leave a Comment