త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా రేపు ఘనంగా రిలీజ్ కాబోతోంది. సాధారణంగా పెద్ద హీరో, పెద్ద బడ్జెట్ సినిమాలు అంటేనే టికెట్ రేట్స్ ఆకాశాన్ని అంటుతు ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చే పర్మిషన్లతోనే ఈ రేట్స్ ని పెంచడం అనేది జరుగుతుంది. అయితే.. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే రేట్స్ పెంచలేరు. తాజాగా.. గుంటూరు కారం సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.
దీనితో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహేష్ పై ప్రేమ కురిపిస్తోంది.. రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గానే పాన్ ఇండియా హీరో గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ సినిమా “సలార్” కూడా రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి నలభై రూపాయల వరకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కానీ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి యాభై రూపాయల అనుమతి ఇచ్చింది. ఈ తేడా పది రూపాయలుగానే కనిపించినా.. ఓవరాల్ గా వచ్చే మొత్తంలో చాలా తేడా ఉంటుంది. ఏపీలో కొన్ని చోట్ల ప్రభాస్ సలార్ సినిమా రికార్డ్స్ సాధించడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మహేష్ సినిమాకు యాభై రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది అని వార్తలు వస్తుండడంతో ప్రభాస్ కి ఒక న్యాయం.. మహేష్ కి ఒక న్యాయమా అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.