Telugu News » Atchannaidu: జగన్‌కు బుర్రలేదు.. అచ్చెన్నాయుడు కౌంటర్..!

Atchannaidu: జగన్‌కు బుర్రలేదు.. అచ్చెన్నాయుడు కౌంటర్..!

పొత్తులపై జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు అధికారం చేపడతాయని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో పొత్తులు కొత్తకాదని తెలిపారు.

by Mano
Atchannaidu: Jagan is not angry.. Atchannaidu counter..!

సీఎం జగన్ (CM Jagan)కు బుర్ర లేదంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శించారు. ఆయన ఆదివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. పొత్తులపై జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు అధికారం చేపడతాయని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో పొత్తులు కొత్తకాదని తెలిపారు. జగన్ తండ్రి కాంగ్రెస్‌లో ఉండగా టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు.

Atchannaidu: Jagan is not angry.. Atchannaidu counter..!

టీడీపీ అధికారం కోసం పొత్తు పెట్టుకోలేదని, పొత్తు చారిత్రాత్మక అవసరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకోవటానికి పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలు అర్థం చేసుకున్న అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు పొత్తుకు వెళ్లారన్నారు. వైసీపీ పతనం ఖాయమని, టీడీపీ టికెట్ల కోసం అభ్యర్థులు క్యూ కడుతున్నారని తెలిపారు. వైసీపీలో పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు.

‘‘సంక్షేమానికి పేటెంట్ హక్కు టీడీపీదే.. జగన్‌కు బుర్ర లేదు.. చంద్రబాబుకు బుర్ర ఉంది.. మా నాయకుడు విజన్ ఉన్న నాయకుడు.. పెట్టుబడులు తెచ్చే సత్తా చంద్రబాబుకు ఉంది.. వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తాం’’ అంటూ అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను టీడీపీ కొనసాగిస్తుందన్నారు. ప్రజల డబ్బు తీసుకుని వైసీపీకి ఊడిగం చేస్తే ఊరుకోమన్నారు.

కుర్చీకి మూడు కాలు ఉంటే పడిపోతుందంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘మా కుర్చీ వైసీపీ కుర్చీని మడత పెట్టేయటం ఖాయం.. వైసీపీని ప్రజలు అసహ్యించుకుంటున్నారు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఉండవని జగన్ కొత్త నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. జగన్‌కు సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.

You may also like

Leave a Comment