ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఒకప్పుడు స్టేబాబుగా ప్రత్యర్ధుల నోట్లో నానిన మాజీ సీఎమ్ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)అరెస్ట్ అయ్యాడు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్(Skill Development Scheme)లో నిధులు మళ్లించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
దీంతో టీడీపీ, అధికార వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధంతో పాటు ట్వీట్ల యద్ధం నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఆయన కొడుకు నారా లోకేష్(Nara Lokesh)ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు.
‘‘పిచ్చోడు లండన్ కి.. మంచోడు జైలుకి.. ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. ఎఫ్ఐఆర్(FIR)లో పేరు లేదు.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు.. మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం.
నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్’’ అని లోకేష్ ట్వీట్ చేశారు. కాగా, ఈ ట్వీట్‌కు మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘‘మీ డాడీ.. కేడి కాబట్టే అరెస్ట్ అయ్యాడు పిల్ల సైకో నారా లోకేష్. మంచోడు కాదు సూట్ కేస్ కంపెనీలతో ముంచేసినోడు మీ నాన్న. కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాని జైలుకి పంపక.. జైలర్ సినిమాకి పంపిస్తారా..? పప్పు మీ నాన్న తుప్పు కాదు నిప్పు అయితే ఈ కుంభకోణంలో విచారణ జరుపుకోండి.. అని ధైర్యంగా చెప్పు..!
చంద్రబాబుని ఇక ఏ దేవుడు కాపాడలేడు.. మీ తాత ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు సంతోషంగా ఉంటుంది. బై బై తుప్పు.. బై బై పప్పు’’ అని రోజా లోకేష్ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇక, ఈ కేసులో చంద్రబాబును విచారిస్తోన్న అధికారులు.. మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.