Telugu News » Chandramukhi Change : చవితికి రానంటున్న ‘చంద్రముఖి-2’..కారణం ఆ హీరోయేనా..!?

Chandramukhi Change : చవితికి రానంటున్న ‘చంద్రముఖి-2’..కారణం ఆ హీరోయేనా..!?

‘చంద్రముఖి’ అప్పట్లో ఈ చిత్రం పెనుసంచలనం. దాదాపు 18యేళ్ల తరువాత సీక్వెల్ రాబోతోంది. బాలీవుడ్ డైనమిక్ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు

by sai krishna

‘చంద్రముఖి’ అప్పట్లో ఈ చిత్రం పెనుసంచలనం. దాదాపు 18యేళ్ల తరువాత సీక్వెల్ రాబోతోంది. బాలీవుడ్ డైనమిక్ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు.


వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 19న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా…ప్రస్తుతం ఈ సినిమా విడుదల వాయిదా అవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనికి కారణం సాంకేతిక సమస్యలేనని ‘చంద్రముఖి 2’ చిత్ర బృందం పేర్కొంది.

అయితే అసలు కారణం వేరే ఉండవచ్చని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shahrukh Khan)నటించిన ‘ జవాన్ ‘ కారణంగా ‘చంద్రముఖి-2’ వాయిదా పడిందని కొందరు చెబుతున్నారు.

రెండు పెద్ద సినిమాలు ఒకేసారి థియేటర్లలో ప్రదర్శితమైతే, అందులో ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం థియేటర్ల వద్ద ‘జవాన్’ సినిమా హవా కొనసాగిస్తుంది.

సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా హైప్ మరిన్ని రోజులు కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో చంద్రముఖి 2 సినిమాను రిలీజ్‌ చేయడం సరైన నిర్ణయం కాదని దర్శక నిర్మాతలు భావించారని టాక్‌ నడుస్తోంది.

అందుకే సెప్టెంబర్ 19న కాకుండా సెప్టెంబర్ 28న చంద్రముఖి 2 విడుదల చేయాలని వారు భావించారని తెలుస్తోంది. కాగా చంద్రముఖి -2 మూవీలో లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, వడివేలు, రాధికా శరత్ కుమార్, సురేష్ మీనన్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషించారు.

ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ‘లైకా ప్రొడక్షన్స్(Lyca Productions)’ బ్యానర్‌పై సుభాష్ కరణ్ ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని నిర్మించారు. పి.వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఆస్కార్‌ విజేత ఎమ్ఎమ్‌ కీరవాణి(MM Keeravani)సంగీతం సమకూర్చారు. రాజశేఖర్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, ఆంథోని ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు ‘జవాన్’ సినిమా మూడ్ బలంగా ఉంది.

ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.129.6 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు కూడా ఏకంగా రూ. 113 కోట్లు రాబట్టి ఓవరాల్‌ గా 250 కోట్లకు సమీపంలో నిలిచింది. కంగనా రనౌత్‌ కూడా జవాన్‌ సినిమాపై ప్రశంసలు కురిపించడం విశేషం.

‘ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ మరోసారి తమను తాము నిరూపించుకోవాలని కలలు కనే ఆర్టిస్టులందరికీ షారూఖ్ ఖాన్ రోల్ మోడల్. షారుఖ్ ఖాన్ సినిమా దేవుడు. కింగ్ ఖాన్‌ కు కంగ్రాట్స్‌’ అని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో రాసుకొచ్చింది.

You may also like

Leave a Comment