Telugu News » Jaiho Jawan : ‘జవాన్’ సినిమాకు జైకొడుతున్న అభిమానం..ఎడ్లబండ్లపై థియేటర్లకు పయనం..!

Jaiho Jawan : ‘జవాన్’ సినిమాకు జైకొడుతున్న అభిమానం..ఎడ్లబండ్లపై థియేటర్లకు పయనం..!

పఠాన్ సక్సెస్ తో ఫామ్ లో కి వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరో సూపర్ హిట్ కొట్టాడు. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee)దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జవాన్’(Jawan) సినిమాతో భారీవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

by sai krishna

పఠాన్ సక్సెస్ తో ఫామ్ లో కి వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరో సూపర్ హిట్ కొట్టాడు. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee)దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జవాన్’(Jawan) సినిమాతో భారీవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

కేవ‌లం రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును దాటేసింది. ఇక ఈ చిత్రంలో షారుఖ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రేక్షకులే కాదు టాలీవుడ్‌ దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

జవాన్‌ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (Red Chillies Entertainments) సమర్పణలో గౌరీ ఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన‌ ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు. షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె గెస్ట్‌ రోల్ చేసింది.

కాగా జవాన్ సినిమా చూడ‌టానికి మహారాష్ట్ర జ‌ల‌గన్‌ న‌గ‌రంలోని షారుఖ్ ఫ్యాన్స్ ఎండ్లబండ్లు(Bullocks),జేసీబీలు, ట్రాక్టర్‌లు, బైకులపై థియేటర్‌కు వెళుతున్నారు. అయితే సన్నీ డియోల్‌ న‌టించిన ‘గదర్‌-2’ (Gadar 2) కూడా ఇలా ట్రాక్టర్‌లపై జ‌నాలు సినిమాకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

చాలా సంవత్సరాల తర్వాత షారుఖ్‌ఖాన్ సినిమాకు ఈ విధంగా థియేటర్‌కు ట్రాక్టర్లలో ప్రేక్షకులు రావడంతో సినీ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

You may also like

Leave a Comment