Telugu News » Balanagar : రోడ్డుపై అభయహస్తం దరఖాస్తులు.. కారకులకు పనిష్మెంట్ ఇచ్చిన అధికారులు..!!

Balanagar : రోడ్డుపై అభయహస్తం దరఖాస్తులు.. కారకులకు పనిష్మెంట్ ఇచ్చిన అధికారులు..!!

అధికారులు కూకట్‌పల్లిలోని ప్రైవేట్‌ ఏజెన్సీతో కంప్యూటరీంచేందుకు వేలాది దరఖాస్తులను ర్యాపిడో స్కూటీపై తరలిస్తుండగా.. రోడ్డుపై పడిపోయాయి.. ఈ దృశ్యాన్ని అటుగా వెళ్తున్న వారు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

by Venu
GHMC Bills Due: Lack of funds in GHMC.. Contractors not coming forward..!

హైదరాబాద్‌ (Hyderabad)లోని హయత్‌నగర్‌ (Hayatnagar) సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు నేటి ఉదయం బాలానగర్‌ (Balanagar) ఫ్లైఓవర్‌పై చిందరవందరగా కనిపించడం రాష్ట్రంలో సంచలనంగా మారిందన్నది తెలిసిందే.. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రజలకోసం ఈ పథకాలను అమలుచేసే పనిలో ఉండగా, ఈ ఘటన జరిగింది.

GHMC Bills Due: Lack of funds in GHMC.. Contractors not coming forward..!

మరోవైపు అధికారులు కూకట్‌పల్లిలోని ప్రైవేట్‌ ఏజెన్సీతో కంప్యూటరీంచేందుకు వేలాది దరఖాస్తులను ర్యాపిడో స్కూటీపై తరలిస్తుండగా.. రోడ్డుపై పడిపోయాయి.. ఈ దృశ్యాన్ని అటుగా వెళ్తున్న వారు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అవి వైరల్ గా మారి అధికారుల దృష్టికి వెళ్ళాయి..

కాగా ఈ సంఘటనపై స్పందించిన అధికారులు.. ఇందుకు కారణం అయిన వారిపై చర్యలు చేపట్టారు.. అభయహస్తం దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హయత్‌నగర్, కుత్బుల్లాపూర్ టీమ్ లీడర్లను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు.

కాంగ్రెస్‌ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు రోడ్డుపై దర్శనమిచ్చినమివ్వడం.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.. ఇప్పటికే సైబర్ నెరగాళ్లు వీటి పేరు చెప్పుకొని దోపిడీకి తెరతీశారనే ప్రచారం జరిగిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిస్తుంది..

You may also like

Leave a Comment