Telugu News » Bhatti Vikramarka : బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పచ్చిగా అమ్మకానికి పెట్టింది..!!

Bhatti Vikramarka : బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పచ్చిగా అమ్మకానికి పెట్టింది..!!

గతంలో ఫార్ము ఈ రేస్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.200 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. అయితే ఫార్మలా ఈ రేస్ కోసం సిటీ శివారులో ట్రాక్ ఏర్పాటు చేస్తే శాశ్వతంగా ఉండిపోయేది. ఎవరికి ఇబ్బంది ఉండకపోయేది. కానీ ట్యాంక్ బండ్ పై నిర్వహించడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.

by Venu

తెలంగాణ (Telangana)లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఫార్ముల ఈ రేస్ మారింది.. ఈ రేసులో అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ముల ఈ రేస్ (Formula E Race) వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ విమర్శలు చేస్తున్నారు.. మరోవైపు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కసైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు..

సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం (Deputy CM) భట్టి విక్రమార్క (Bhatti Vikramarka).. బీఆర్ఎస్ (BRS) పై విరుచుకుపడ్డారు.. ఓ కంపెనీకి లబ్ధి చేకూర్చడం కోసమే ఈ-ఫార్ములా రేసు పెట్టారని.. బిజినెస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరించారంటు ఆరోపించారు.. ఫార్ములా ఈ-రేస్ వెనక్కి వెళ్లడంతో నష్టం జరిగిందని గగ్గోలు పెడుతోన్న బీఆర్‌ఎస్‌ నేతలు.. దీనివల్ల రాష్ట్రానికి ఉన్న లాభాలు వివరించాలని సూచించారు..

మరోవైపు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల కష్టాలు మరింత పెరిగేవని వెల్లడించిన భట్టి.. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పచ్చిగా అమ్మకానికి పెట్టిందని ఫైర్ అయ్యారు. ఈ రేసుకు రూ.110 కోట్లు కట్టారు. కానీ రేస్‌ టికెట్లు అమ్ముకొని, ఓ కంపెనీ లబ్ధిపొందిందని ఆరోపించారు.. ఫార్ములా ఈ-రేస్‌ పై మాజీ మంత్రుల వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడ్డారు..

కాగా గతంలో ఫార్ము ఈ రేస్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.200 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. అయితే ఫార్మలా ఈ రేస్ కోసం సిటీ శివారులో ట్రాక్ ఏర్పాటు చేస్తే శాశ్వతంగా ఉండిపోయేది. ఎవరికి ఇబ్బంది ఉండకపోయేది. కానీ ట్యాంక్ బండ్ పై నిర్వహించడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఈవెంట్ ను నిర్వహించడంలో ఆసక్తి చూపలేదని సమాచారం..

You may also like

Leave a Comment