Telugu News » Bandi Sanjay : అంత సంస్కార హీనున్ని కాను.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..!

Bandi Sanjay : అంత సంస్కార హీనున్ని కాను.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..!

కార్యకర్తలకి అన్యాయం జరిగితే ప్రశ్నించే వారిలో తాను ముందు ఉంటానని వెల్లడించారు. ప్రస్తుతం పార్టీలో చాలా మంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారన్నారని అన్నారు.

by Venu
bandi sanjay

బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) తనపై వస్తున్న విమర్శలకు స్పందించారు.. తనకు కల్మషం ఉండదని, ఎవరి మీద కోపం ఉండదని.. ఎవరితో తనకు అభిప్రాయ భేదాలు లేవని తెలిపారు. బీజేపీ అనేది పెద్ద కుటుంబం అని తెలిపిన ఆయన.. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయనిపేర్కొన్నారు. పార్టీలో ఉంటూ పార్టీ కోసం పని చేయక పోతే కన్న తల్లికి ద్రోహం చేసినట్టేనని పేర్కొన్నారు..

Bandi sanjay fire om minister ktrమా నాయకుల మీద కామెంట్ చేసే అంత సంస్కార హీనున్ని కాదన్న బండి సంజయ్.. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు టికెట్ ఇవ్వాలని కోరారు. తన వల్లనే పార్టీ ఉందని ఎప్పుడు చెప్పుకోలేదని తెలిపిన ఆయన.. తాను ఉన్నా లేకున్నా పార్టీ ఉంటుందని అన్నారు.. కార్యకర్తలకి అన్యాయం జరిగితే ప్రశ్నించే వారిలో తాను ముందు ఉంటానని వెల్లడించారు. ప్రస్తుతం పార్టీలో చాలా మంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారన్నారని అన్నారు.

అదేవిధంగా పార్టీలోకి వలస వచ్చే వారి విషయంలో ఆలోచించి వ్యవహరించాలని సూచించారు. బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించిన వారిని, కార్యకర్తలను రాచి రంపాన పెట్టిన వారినీ పార్టీలో చేర్చుకోవడాన్ని తాను వ్యతిరేకిస్తానని, అడ్డుకుంటానని బండి సంజయ్‌ తెలిపారు. కరీంనగర్ (Karimnagar) పార్లమెంట్‌కు12 వేల కోట్ల ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చానని తెలిపిన ఆయన.. సొంత పార్టీ కార్యకర్తలే వినోద్ కుమార్‌ను గుర్తు పట్టరన్నారు.

కరీంనగర్‌కు గత ఎంపీ చేసిందేమీ లేదని, అయన అభివృద్ధి చేసి ఉంటే.. నన్ను లక్ష ఓట్లతో ఎలా గెలిపించారని ప్రశ్నించారు.. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ (BRS) అభ్యర్థి పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారన్నారని అన్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)ను గెలిపించి తప్పు చేశామనే భావనలో ప్రజలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పై వ్యతిరేకత వ్యక్తం అవుతోందని బండి తెలిపారు.

You may also like

Leave a Comment