Telugu News » Bhogi Danda: కోనసీమ భోగి సంబురాలు.. 500 మీటర్ల పొడవున్న భోగి దండతో ర్యాలీ..!

Bhogi Danda: కోనసీమ భోగి సంబురాలు.. 500 మీటర్ల పొడవున్న భోగి దండతో ర్యాలీ..!

అమలాపురం(Amalapuram)లోని గారపాటి వారి వీధిలో భారీ భోగి దండతో గ్రామస్తులు సంబురాలు నిర్వహించారు. సుమారు 500 మీటర్లు పొడవున్న ఈ భోగి దండ కోసం దాదాపు 1500 భోగి పిడకలను వినియోగించారు.

by Mano
Bhogi Danda: Konaseema Bhogi celebrations.. Rally with 500 meters long Bhogi Danda..!

కోనసీమ జిల్లా(Konaseema District)లో భోగి సంబురాలు(Bhogi Celebrations) అంబరాన్నంటాయి. అమలాపురం(Amalapuram)లోని గారపాటి వారి వీధిలో భారీ భోగి దండతో గ్రామస్తులు సంబురాలు నిర్వహించారు. భారీ దండ అందరినీ ఆకట్టుకుంటుంది.

Bhogi Danda: Konaseema Bhogi celebrations.. Rally with 500 meters long Bhogi Danda..!

సుమారు 500 మీటర్లు పొడవున్న ఈ భోగి దండ కోసం దాదాపు 1500 భోగి పిడకలను వినియోగించారు. ఈ భారీ భోగి దండ వీధివీధి అంతా కలిపి మోసుకొని వచ్చి భోగిమంటల్లో వేశారు. ఈ భోగి దండన తయారు చేసేందుకు సుమారు నెలరోజులపాటు సమయం పట్టిందని గారపాటి వారి వీధి గ్రామస్తులు చెబుతున్నారు.

సంప్రదాయాలను మర్చిపోకుండా ఉండేందుకే అందరూ ఏకమై ఇంత భారీ భోగి దండం తయారు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ భారీ బోగి దండ జిలాల్లో పండుగపూట ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. అదేవిధంగా అమలాపురంలో స్వగ్రామానికి చేరుకున్న కుటుంబీకులంతా భోగి సంక్రాంతి వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు.

స్థానిక పారిశ్రామిక వేత్త నందెపు వెంకటేశ్వర రావు నివాసంలో గంగిరెద్దులు, హరిదాసులు ఎడ్లబండ్లు తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాటు చేశారు. సంక్రాంతి వేడుకల కోసం కుటుంబ సభ్యులంతా ఒకే చోటు చేరుకున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి కోడిపందాలు ఆడారు. మహిళలు కుటుంబ సభ్యులు ఏకమై డింకి పందెం ఆడారు. ఆచారంగా వస్తున్న కత్తి సాము చేశారు.

You may also like

Leave a Comment