Telugu News » Case on Bhola : నో రిలీజ్ కేసులో ‘భోళా’…కోర్టు ఏ తీర్పిచ్చిందంటే…!?

Case on Bhola : నో రిలీజ్ కేసులో ‘భోళా’…కోర్టు ఏ తీర్పిచ్చిందంటే…!?

ఎట్టకేలకు‘భోళా శంకర్(Bhola sankar)’ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది.ఆగస్ట్ 11న సినిమా విడుదల చేసుకునేలా తీర్పునిచ్చింది

by sai krishna

ఎట్టకేలకు‘భోళా శంకర్(Bhola sankar)’ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది.ఆగస్ట్ 11న సినిమా విడుదల చేసుకునేలా తీర్పునిచ్చింది.‘భోళా ’ రిలీజ్ నిలిపివేయాలని గాయత్రి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్(Gayatri Films Distributor) సతీశ్ వేసిన పిటీషన్ను సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. ‘భోళాశంకర్’ విడుదలకు లైన్ క్లియర్ చేసింది.

‘ఏజెంట్(Agent)’ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్(AK Entertainments) బ్యానర్పై అనిల్ సుంకర నిర్మించారు. ఇప్పుడు ‘భోళాశంకర్’ చిత్రాన్ని ఆయనే నిర్మించారు. వీటిలో ‘ఏజెంట్’ మూవీ భారీ డిజాస్టర్ను అందుకోని నష్టాల్ని మిగల్చగా.. ‘భోళాశంకర్’ ఆగస్ట్ 11న రిలీజ్కు రెడీ అయింది.

ఈ నేపథ్యంలో తనకు ఏజెంట్ సినిమా హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రూ.30 కోట్లు తీసుకుని మోసం చేశారని గాయత్రి ఫిలిమ్స్ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీశ్ కోర్టును ఆశ్రయించారు.

‘భోళాశంకర్’ సినిమా విడుదలలోపు డబ్బులు విషయంలో తనకు ఏదో ఒకటి స్పష్టతనిస్తానని చెప్పిన అనిల్ సుంకర, ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తకుండా తప్పించుకుంటున్నారంటూ, మూవీ విడుదల తేదీని ఆపాలని..సతీశ్ కోర్టును ఆశ్రయించారు.

కాగా ఆగస్ట్ 9న ఈ కేసుకు సంబంధించి ‘ఏజెంట్’ సినిమా నగదు లావాదేవీలను పరిశీలించిన న్యాయస్థానం..ఆగస్ట్ 10కు వాయిదా వేసింది.కేసుకు సంబంధించి అన్ని విషయాలను కోర్టు విచారించింది.

ఇరు వాదనలు వినిన న్యాయస్థానం.. చివరికి చిరు సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గాయత్రి ఫిలిమ్స్ సతీశ్ పిటీషన్ను కొట్టేసింది.

You may also like

Leave a Comment