Telugu News » BJP : కాంగ్రెస్ కు గట్టి కౌంటర్ వేసిన బీజేపీ నేతలు.. రేవంత్ కు జైలు తప్పదు..!

BJP : కాంగ్రెస్ కు గట్టి కౌంటర్ వేసిన బీజేపీ నేతలు.. రేవంత్ కు జైలు తప్పదు..!

రాష్ర్ట ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ కు అవగాహన లేదా..? కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక మేధావులు లేరా..? అని ప్రశ్నించిన వెంకటేశ్వర్లు.. హిందువుల మీద, సనాతన ధర్మాల మీద నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మండిపడ్డారు..

by Venu

రిజర్వేషన్లకు బీజేపీ (BJP) వ్యతిరేకం అని వస్తున్న వార్తలపై ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు.. కాంగ్రెస్ (Congress) చేస్తున్నవి అసత్య ప్రచారాలని వివరిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల ప్రేమేందర్ (Gujjula Premender) కీలక వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ ఉన్నంతవరకు రిజర్వేషన్లు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.. ఓబీసీలు నష్టపోయింది కాంగ్రెస్ పాలనలోనే అని ఆరోపించారు.

మరోవైపు బీజేపీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హామీల అమలుపై రేవంత్ రెడ్డి రోజుకొక దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ సర్వేలన్నీ బీజేపీ వైపుకు చూపిస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అభద్రత భావనలో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక మంత్రి పదవిలో ఉన్న ఆయన సోయి లేకుండా బజారు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు..

రాష్ర్ట ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ కు అవగాహన లేదా..? కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక మేధావులు లేరా..? అని ప్రశ్నించిన వెంకటేశ్వర్లు.. హిందువుల మీద, సనాతన ధర్మాల మీద నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. దేశాన్ని హిందూ దేశంగా బీజేపీ మార్చాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని సూచించారు.. ఇక ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని మా మేనిఫెస్టో లోనే పెట్టాం, అది అమలు చేస్తామని తెలిపారు.

మోడీ (Modi) ప్రభుత్వం బీసీలకు పెద్ద పీట వేసిందని తెలిపిన ఆయన.. మోడీ పాలనలోనే బీసీలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ రాష్ర్ట సెక్రటరీ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ కేసీఆర్ ను మించిపోతున్నాడని విమర్శించారు. ఆర్ ఎస్ ఎస్ ను విమర్శించే స్థాయి రేవంత్ కు లేదని అన్నారు.. ఇలా చేసిన రాజీవ్ గాంధీ జైలు ఊసులు లెక్కపెట్టారు అదే పరిస్థితి రేవంత్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు..

ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా 29 న రాష్ట్రానికి నడ్డ రానున్నారు. ఆయన ఖమ్మం, మహబూబ్ బాద్ లో జరిగే సభలో పాల్గొంటారు.. అదేవిధంగా కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి లో జరిగే రోడ్ షో లో పాల్గొంటారు. ఇక మోడీ సైతం 30న రాష్ట్రానికి రానున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో జరిగే సంకల్ప సభలో పాల్గొంటారు. ఇక మే 1 న రాష్ట్రానికి రానున్న అమిత షా లాల్ దర్వాజ అమ్మవారి టెంపుల్ నుంచి శాలిబండ సుధా థియోటర్ వరకు జరిగే రోడ్ షో లో పాల్గొంటారు..

You may also like

Leave a Comment