Telugu News » Hyderabad : రైతులను మోసం చేసిన కేసీఆర్.. ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నారు..! ఉత్తమ్ కుమార్..

Hyderabad : రైతులను మోసం చేసిన కేసీఆర్.. ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నారు..! ఉత్తమ్ కుమార్..

కేసీఆర్ స్పీచ్ విన్నాక ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడాడు అనిపించిందని అన్నారు.. అధికారం దూరం అవగానే కేసీఆర్ డిప్రెషన్, ఫస్ట్రేషన్ లోకి వెళ్లారని విమర్శించిన మంత్రి.. ఆయన మాట్లాడిన ప్రతి మాట అబద్దమే అని ఆరోపించారు..

by Venu
Uttam kumar Reddy Fire on bjp and brs

రాష్ట్రంలో రాజకీయాలు వేసవి వేడిని మరిపించేలా సాగుతున్నాయి. కేసీఆర్ (KCR) కు ఇన్నాళ్ళకు రైతులు గుర్తుకు వచ్చి పల్లెబాట పట్టారని కాంగ్రెస్ (Congress) నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. గులాబీ బాస్ సైతం వెనక్కి తగ్గకుండా.. హస్తంపై ఘాటు విమర్శలతో విరుచుకుపడటం కనిపిస్తుంది. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy).. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు..

minister uttam kumar reddys shocking comments on lok sabha electionsనేడు గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్.. పదవి పొగానే కేసీఆర్ కు ప్రజలు గుర్తుకు వచ్చారని మండిపడ్డారు.. నిన్న కేసీఆర్ స్పీచ్ విన్నాక ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడాడు అనిపించిందని అన్నారు.. అధికారం దూరం అవగానే కేసీఆర్ డిప్రెషన్, ఫస్ట్రేషన్ లోకి వెళ్లారని విమర్శించిన మంత్రి.. ఆయన మాట్లాడిన ప్రతి మాట అబద్దమే అని ఆరోపించారు..

అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిపోవడంతో ముఖం చాటేసిన కేసీఆర్.. పార్టీ మిగలదు అనే భయంతో కొత్త నాటకాలకు తెరతీశారని మండిపడ్డారు.. ఉన్న పార్టీని కాపాడుకోవడానికి చేతకాలేదు కానీ పొంగనాలకు పోయి జాతీయ పార్టీ అన్నారు.. చివరికి దొంగ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు.. ఇప్పటి వరకు ఇంత తొందరగా ఏ పార్టీ కుప్ప కూలిపోలేదని విమర్శించారు.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మిగలదని ఉత్తమ్ జోస్యం చెప్పారు..

పార్టీలో చివరికి మిగిలేది కేసీఆర్, ఆయన కుటుంబలని ఎద్దేవా చేశారు.. జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంట్ పోయింది అని కేసీఆర్ అబద్దం చెప్పారని మండిపడ్డారు.. అదేవిధంగా భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ అని ఆరోపించిన ఉత్తమ్.. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారం పడుతుందని అన్నారు.. గత పదేండ్లలో పంట నష్టం జరిగితే రూపాయి కూడా ఇవ్వలేదని కేసీఆర్ పై మండిపడ్డారు.

ఇరిగేషన్ పై మాట్లాడే అర్హత ఆయనకు లేదని తెలిపారు. ప్రాజెక్టులను KRMBకి అప్పచెప్తామని కేసీఆర్ ఒప్పుకున్నారు.. కేసీఆర్ జగన్ కలిసి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ హయాంలో తెలంగాణకి ఎక్కువ ద్రోహం జరిగిందని మండిపడ్డారు.. పోలీస్ శాఖను ఎక్కువ మిస్ యూజ్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు పోలీసులు న్యూట్రల్ గా ఉండాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు.. కరువు వచ్చింది బీఆర్ఎస్ పాలనలోనే దాన్ని సమర్థవంతంగా డీల్ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు..

You may also like

Leave a Comment