Telugu News » Reward : ఒక్క ఐడియా చాలు రూ. 10 లక్షలు మీవే ..ఎందుకు,ఏమిటి,ఎలా..!?

Reward : ఒక్క ఐడియా చాలు రూ. 10 లక్షలు మీవే ..ఎందుకు,ఏమిటి,ఎలా..!?

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది.ఇది కొట్టిపాడేయాల్సిన కొటేషన్ కాదు.నింజంగానే ఎంతో మంది జీవితాలను మార్చేసిన మాట.

by sai krishna

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది.ఇది కొట్టిపాడేయాల్సిన కొటేషన్ కాదు.నింజంగానే ఎంతో మంది జీవితాలను మార్చేసిన మాట. నేటి సామాజిక, సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికై ఎంతో మంది దగ్గర ఎన్నో ఆలోచనలు ఉంటాయి.

అయితే వాటిని ఎవరితో పంచుకోవాలో, ఎలా ప్రగతి మార్గం పట్టించాలో వారికి తెలియదు. ఒక్క ఛాన్స్ ఇస్తే తమ సత్తా చాటుదాం అనుకుంటారు. అలాంటి వారికోసం గతేడాదిలాగే ఏవియేషన్ కంపెనీ బోయింగ్ ఇండియా(Aviation company Boeing India)తన బిల్డ్ ప్రోగ్రామ్ మూడవ ఎడిషన్‌ను ప్రారంభించింది.


విమానయానం, రక్షణ, సాంకేతికత, సామాజిక సమస్యలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు, నిపుణుల నుంచి వినూత్న ఆలోచనలను ఆహ్వానిస్తోంది. ఉత్తమ ఆలోచనను పంచుకున్న వారు రూ.10 లక్షల బహుమతిని గెలుచుకునే అవకాశం ఉంది. రక్షణ, సాంకేతిక, సామాజిక సమస్యల పరిష్కార మార్గాలను సూచించే శక్తి సామర్ధ్యాలు మీలో ఉంటే ఈ 10లక్షల రూపాయల బహుమతిని గెలుచుకోవచ్చు.

దీని పూర్తి పేరు ‘బోయింగ్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్’ (Boeing University Innovation Leadership Development). ఈ కార్యక్రమం కింద కంపెనీ ఏరోస్పేస్, రక్షణ, సాంకేతికత, సామాజిక ప్రభావం(social impact), స్థిరత్వం(sustainability) వంటి అంశాలలో ఐడియాస్ ఇవ్వాల్సి ఉంటుంది.

బోయింగ్ ఇండియా ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, కొత్త పారిశ్రామికవేత్తలు పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం లక్ష్యం వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడం, కొత్త మార్కెట్ అవకాశాలకు మార్గం సుగమం చేయడం.

మీరు దీని కోసం మీ ఆలోచనను నవంబర్ 10 వరకు పంపవచ్చు. దీని కోసం మీరు బోయింగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు. అక్కడ కార్యక్రమంలో పాల్గొనేందుకు కంపెనీ లింక్ ను ఇచ్చింది.

IIT ముంబై(IIT Mumbai), ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ ఫర్-IIT ఢిల్లీ, IIT గాంధీనగర్, IIT మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్, IISc బెంగళూరు, T-హబ్ హైదరాబాద్, KIIT భువనేశ్వర్‌లతో సహా BUILD ప్రోగ్రామ్ యొక్క మూడవ ఎడిషన్ కోసం బోయింగ్ ఇండియా 7 ఇంక్యుబేటర్‌లతో ఒప్పందం చేసుకుంది.

ఇందులో ప్రారంభంలో వచ్చిన కొన్ని ఆలోచనలు షార్ట్‌ లిస్ట్ చేయబడతాయి. మొత్తం ఏడు ఇంక్యుబేషన్ సెంటర్ల సహాయంతో వాటిని ముందుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత బోయింగ్ ఇమ్మర్షన్ డే సందర్భంగా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున బహుమతిగా అందజేస్తారు.

ఇలా ఏడు ఆలోచనలను నిపుణులు ఎంపిక చేస్తారు. గతేడాది ఈ కార్యక్రమంలో 1,600 మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. 800 కంటే ఎక్కువ ఆలోచనలు ప్రదర్శించబడ్డాయి.

You may also like

Leave a Comment