Telugu News » Next Mega Movie : అభిమానులకు మెగా గిఫ్ట్…156వ మూవీ అఫీషియల్ అనౌన్స్…!

Next Mega Movie : అభిమానులకు మెగా గిఫ్ట్…156వ మూవీ అఫీషియల్ అనౌన్స్…!

మెగాస్టార్ చిరంజీవి..ఏళ్లుగడిచినా ఎప్పటికీ అదే జోష్ ..అదే గ్రేస్. చిరు చరిష్మాలో ఎలాంటి మార్పులేదు. కూడా డ్యాన్స్, ఫైట్స్ ,యాక్షన్ ,కామెడీలతో కొత్తతరాన్ని కూడా కట్టిపడేస్తున్నాడు.

by sai krishna

మెగాస్టార్ చిరంజీవి..ఏళ్లుగడిచినా ఎప్పటికీ అదే జోష్ ..అదే గ్రేస్. చిరు చరిష్మాలో ఎలాంటి మార్పులేదు. కూడా డ్యాన్స్, ఫైట్స్ ,యాక్షన్ ,కామెడీలతో కొత్తతరాన్ని కూడా కట్టిపడేస్తున్నాడు.వృత్తిగతంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చిరంజీవి జీవితం స్ఫూర్తిదాయకం.

కాచే చెట్టుకే రాళ్లదెబ్బలు అన్నట్టుగా..తన స్థాయికి సరిపోనివాళ్లు విమర్శించినా చిరు సమాధానం చిరునవ్వే. స్థిరత్వంలో,కష్టపడే తత్వంలో,స్థిత ప్రజ్ఞతలో ఆయనకు ఆయనే సాటి.మెగాస్టార్ గా ఎదిగినా మిడిసిపాటు లేని అందరివాడు చిరంజీవి.

లక్షలాది అభిమాన గణాన్ని సంపాదించుకున్న చిరంజీవి పుట్టినరోజు ఈ రోజు. గోల్డెన్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్(Golden Box Entertainments)లో బ్యానర్ లో 156 వ సినిమాను చిరు కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇప్పుడా సినిమాను అఫీషియల్ అనౌన్స్ చేశారు మేకర్స్.

‘4 దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న లెగసీ(Legacy), లక్షలాది మందికి భావోద్వేగాలను కలిగించే వ్యక్తిత్వం, తెర ముందూ, తెరవెనకా ఒకేలా పిలవబడే వ్యక్తి..’ అని రాసుకొచ్చి ఓ స్పెషల్ పోస్టర్( Special poster)ను రిలీజ్ చేశారు. 155 సినిమాల తర్వాత రాబోతున్న ఈ సినిమా మెగా రాకింగ్గా ఉండబోతుందని పేర్కొంది.

ఈ పోస్టర్లో చిరంజీవి తన మీసాలను పదునుగా చేస్తుకుంటూ చురకత్తులాంటి చూపులతో గంభీరంగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ పోస్టర్ బ్యాక్గ్రౌండ్లో ఆయన నటించిన గత సూపర్ హిట్ సినిమాల పేర్లన్నీ కనిపించడం విశేషం. అయితే ఈ చిత్ర వివరాల గురించి ఏమీ చెప్పలేదు.

ఈ సినిమాకు మలయాళ సూపర్ హిట్ చిత్రం బ్రో డ్యాడీ(bro daddy)కి రీమ్క్గా రానుందని మొదటి నుంచే ప్రచారం సాగుతోంది. దీనికి బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణ(Kalyan Krishna)దర్శకత్వం వహించనున్నారు.

You may also like

Leave a Comment