Telugu News » Trisha full busy : వరుస ఆఫర్లతో బిజీ అయిన త్రిష…!

Trisha full busy : వరుస ఆఫర్లతో బిజీ అయిన త్రిష…!

ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చెదరని చిరునవ్వు ఆమెది. ఏళ్లు గడిచినా చెక్కు చెదరని రూపం ఆమెది.

by sai krishna

ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చెదరని చిరునవ్వు ఆమెది. ఏళ్లు గడిచినా చెక్కు చెదరని రూపం ఆమెది. హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లతో తన సినీ ప్రయాణం మొదలు పెట్టి…అనతి కాలంలో బిజియెస్ట్ హీరోయిన్ గా ఎదిగింది.


ఎందరో స్టార్ హీరోల సరసన నటించి దక్షిణాది సినిమా(South cinema)ని ఏలుతోంది. ఆమె మరెవరో కాదు. కుర్రకారు గుండెల్లో నిండిన నిషా..అందాల త్రిష. సినిమా అంటేనే కొత్తదనం ఆ క్రమంలో ఎందరో తారలు వెండి తెరకు పరిచయం అయ్యారు.

ఇలా తళుక్కుమని మెరిసి..అలా ఒకట్రెండు ఏళ్లకే మాయమయ్యారు. ఎవరైనా తమ ట్యాలెంటె‌తో కొన్నేళ్లు నెట్టుకొచ్చినా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలోపే..వచ్చిన దారిన వెళ్లిపోయారు.

త్రిష అలా కాదు. హీరోలతో పోటీపడుతూ దశాబ్ధాల పాటు నిలిచి నిలదొక్కుకుంది. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్(Remuneration) అందుకుంటున్న హీరోయిన్‌గా కొనసాగుతోంది.


తమిళ పొన్ను త్రిష 20 ఏళ్లుగా అటు తమిళ్.. ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలో నిరాటకంగా కెరీర్ కొనసాగిస్తోంది. 1999లో తమిళ్‌లో జోడి చిత్రం ద్వారా త్రిష సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు.

‘నీ మనసు నాకు తెలుసు’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ‘వర్షం’ మూవీ త్రిష‌కు తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చింది. చిరంజీవి(Chiranjeevi) నెక్స్ట్ మూవీలో త్రిషను తీసుకోవచ్చని ప్రచారం జరుగుతున్న వేళ..ఆమె మరో క్రేజీ ఆఫర్ కొట్టేశారు.


స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar)హీరో‌గా తెరకెక్కనున్న ‘విడాముయర్చి’ మూవీలో త్రిష హీరోయిన్‌గా ఎంపికయ్యింది. త్రిష, అజిత్ కాంబినేషన్‌లో ఇది ఐదో సినిమా. గతంలో వారిద్దరి కాంబినేషన్‌లో యన్నై అరిందాల్, మన్గాత, జై, కిరీటం సినిమాలు వచ్చాయి లైకా ప్రొడైక్షన్స్‌ నిర్మించనున్న ఈ మూవీకి అనిరుధ్ (Anirudh) సంగీత బాణీలు సమకూర్చనున్నారు.

ఈ మూవీలో సంజయ్ దత్, అర్జున్ దాస్ కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో అబుదాబీలో ఈ మూవీ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు మేకర్స్. ప్రస్తుతం దళపతి విజయ్ సరసన లియో మూవీలో త్రిష నటిస్తోంది. విజయ్, త్రిష కాంబినేషన్‌లోనూ గతంలో పలు సినిమాలు వచ్చాయి. వరుస మూవీల్లో నటిస్తూ 40 ఏళ్లలోనూ తన సత్తా ఏంటో నిరూపిస్తోంది త్రిష.

You may also like

Leave a Comment