Telugu News » old city metro station: పాతబస్తీ మెట్రో పనులకు మట్టి పరీక్షలు!

old city metro station: పాతబస్తీ మెట్రో పనులకు మట్టి పరీక్షలు!

పాతబస్తీలోని కారిడార్‌ 2లో ఎంజీబీఎస్‌, ఫలక్‌ నుమా మధ్య ఎంతో కాలంగా పెండింగ్‌ లో ఉన్న 5.5 కిలో మీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడంతో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఆ పనులు చేపట్టాడానికి ముందుకు వచ్చింది.

by Sai
hmrl initiates soil testing to lay foundation for old-city metro

పాతబస్తీ (old city)లోని మెట్రో రైలు ప్రాజెక్ట్‌ (metro project) పనుల కోసం అధికారులు ముందడుగు వేసింది. మెట్రో పిల్లర్ల పునాది వేయడానికి అక్కడి మట్టిని పరీక్షించేందుకు(geotechnical investigaton) హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌ చర్యలు ప్రారంభించింది.

hmrl initiates soil testing to lay foundation for old-city metro

పాతబస్తీలోని కారిడార్‌ 2లో ఎంజీబీఎస్‌, ఫలక్‌ నుమా మధ్య ఎంతో కాలంగా పెండింగ్‌ లో ఉన్న 5.5 కిలో మీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడంతో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఆ పనులు చేపట్టాడానికి ముందుకు వచ్చింది.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ (kcr) ఆదేశాల ప్రకారం..మెట్రో పిల్లర్లు వేసేందుకు సుమారు 54 చోట్ల బోర్‌ హోల్‌ డ్రిల్లింగ్ ద్వారా విచారణ చేపట్టేందుకు అధికారులు ప్రైవేట్‌ ఏజెన్సీలకు ఈ పని అప్పగించారు.

కేవలం మట్టి పరీక్షలకే సుమారు 26 లక్షల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం మూడు నుంచి నాలుగు నెలల టైమ్‌ పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పాతబస్తీ లో ఏర్పాటు చేసే ఈ మెట్రో దారుల్ షిఫా, పురానీ హవేలీ, ఎట్టేబార్‌ చౌక్‌, అలీజా కోట్ల, మీర్‌ మోమిన్‌ దైరా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌ గంజ్‌, అలియాబాద్‌ వంటి ముఖ్యమైన జంక్షన్ ల గుండా సాగుతుంది.

ఈ మెట్రోలైన్ లో మొత్తం ఐదు స్టేషన్లు ఉంటాయి. సాలార్‌జంగ్‌ మ్యూజియం(salarjung museum), చార్మినార్‌(charminar), శాలిబండ, షమ్‌షీర్‌గంజ్‌, ఫలక్‌ నామా అనే స్టాపులు ఉంటాయి. సాలార్‌ జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌ నుంచి సుమారు 500 మీటర్ల దూరంలో ఈ స్టేషన్లు ఉన్నాయి.

కానీ ఆ ప్రదేశాల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు వాటి పేర్లను స్టేషన్లుకు పెట్టారు. అంతేకాకుండా కొన్ని పురాతన నిర్మాణాలను వాటిని సంరక్షించేందుకు రోడ్లను కూడా 80 అడుగులకే పరిమితం చేశారు.

You may also like

Leave a Comment