హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో వరద బీభత్సం సృష్టిస్తోంది. సోలాన్ జిల్లా(Solan District) జాడోన్(Jadon)గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు.
రెండు ఇళ్లు , ఒక గోశాల పూర్తిగా కొట్టుకుపోయాయి.ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. పలు చోట్ల రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ..దాని పరిధిలోని అన్ని పరీక్షలను వాయిదా వేసింది.
వాటిని ఆగస్టు 14న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విద్యాసంస్థలకు సెలవులు ఆగస్టు 14 వరకు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శికి ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhwinder Singh Sukh) ఆదేశాలు జారీ చేశారు.
పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసు తగు సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి, హోం శాఖ కార్యదర్శికి, జిల్లా కలెక్టర్లకు సూచించారు. రవాణా, విద్యుత్, నీటి సరాఫరాలు సాఫీగా సాగేలా చూడాలని సీఎమ్ సుఖ్విందర్ ఆదేశించారు.