336
ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)మీరట్(Meerut) ప్రాంతంలో పగుళ్లు ఏర్పడుతున్నాయి.దీంతో ఆ ప్రాంతంలోని దాదాపు 30 ఇళ్లు బీటలు వారాయి.దీంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనలకు లోనవుతున్నారు.
విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కారణాలు గుర్తించడంలో సంబంధిత యంత్రాంగం విఫలమయ్యింది.దీంతో ఐఐటీ రూర్కీ(IIT Roorkee)నిపుణుల బృందం విచారణ ప్రారంభించింది.
మీరఠ్ లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో డాలంపాండ(Dalampanda)ఒకటి. అక్కడ సుమారు 100కు పైగా ఇళ్లు ఉన్నాయి. 20 రోజుల క్రితం.. 30 ఇళ్ల గోడల్లో ఒక్కసారిగా పగుళ్లిచ్చాయి. దీంతో స్థానికులతోపాటు అధికారులు కూడా ఆందోళనకు గురయ్యారు.